Elon Musk : యూజర్లకు షాకిచ్చిన మస్క్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరు డబ్బు చెల్లించాల్సిందే..!

Elon Musk : ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారులకు ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ట్విట్టర్ ను వాడేందుకు ప్రతి యూజర్ కొంత మెుత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట!  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 09:50 PM IST
Elon Musk : యూజర్లకు షాకిచ్చిన మస్క్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరు  డబ్బు చెల్లించాల్సిందే..!

Elon Musk  Shock forTwitter Users : ట్విట్టర్​ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఏదో ఒక మార్పు చేస్తూనే ఉన్నాడు. ట్విట్టర్​ పేరును కాస్త 'ఎక్స్​'గా మార్చేసిన ఈ అపరకుబేరుడు.. మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సబ్‌స్క్రిప్షిన్ సేవలను తీసుకొచ్చిన మస్క్..యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆదాయాన్ని పెంచుకోనేందుకు ఇకపై ఖాతాదారులందరి నుంచి నెలవారిగా సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.  అయితే ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజును వసూలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. మరి ఈ ఫీజు ఎంత వసూలు చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. 

తాజాగా ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూ, ఎలాన్ మస్క్‌ చర్చలు జరిపారు.  లైవ్​ స్ట్రీమింగ్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు పలు కీలక విషయాలపై మాట్లాడారు. ఇజ్రాయిల్ ప్రధాని మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని.. ఇందుకు ముఖ్య కారణం బాట్స్ అని వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన మస్క్.. తాము ఆ దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే త్వరలోనే ట్విట్టర్(ఎక్స్) ఖాతాదారులకు నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఫీజును విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బాట్‌లు వినియోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టమవుతుందని మస్క్ తెలిపారు. ప్రస్తుతం ఎక్స్​కు ప్రతి నెలా 550 మిలియన్​ మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారు. వీరిపై కొంత మెుత్తంలో ఛార్జ్ చేసినా.. అది ఎక్స్ కు ఎనలేని లాభాలను తెచ్చిపెడుతుంది. 

Also Read: LPG Gas Prices Today: గ్యాస్ ధరలపై భారీ తగ్గింపు.. రూ.450 కే సిలిండర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News