MLA Caught Opening Fire: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఎమ్మెల్యే కాల్పులు.. వీడియో వైరల్

MLA Sunil Saraf Opened Fire: తొలుత కాల్పుల శబ్ధం విని పార్టీ అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఏమోనని అదిరిపడ్డారు. కానీ స్టేజిపై ఎమ్మెల్యే చేతుల్లో తుపాకీ ఉండటం, ఎమ్మెల్యేనే గాల్లోకి కాల్పులు జరుపుతుండటం చూసి అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 11:34 PM IST
MLA Caught Opening Fire: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఎమ్మెల్యే కాల్పులు.. వీడియో వైరల్

MLA Sunil Saraf Opened Fire: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొన్ని చోట్ల శృతిమించిపోయాయి. తన నివాసంలో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అనుప్పుర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సునిల్ శరఫ్ శనివారం రాత్రి తన మద్దతుదారులకు న్యూ ఇయర్ పార్టీ ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్దతుదారులను చేయి జారిపోనివ్వకుండా ఉండటం కోసం వారికి ఘనంగా విందు, మందు పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే... ఆ విందులో బాలీవుడ్ ఐటం సాంగ్స్‌కి అందరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ క్రమంలోనే పార్టీ మూడ్‌లో,  హుషారుగా తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి పైకి కాల్పులు జరిపాడు.

తొలుత కాల్పుల శబ్ధం విని పార్టీ అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఏమోనని అదిరిపడ్డారు. కానీ స్టేజిపై ఎమ్మెల్యే చేతుల్లో తుపాకీ ఉండటం, ఎమ్మెల్యే సునిల్ శరఫ్ గాల్లోకి కాల్పులు జరుపుతుండటం చూసి అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

పదిమంది ఉన్న చోట వారికి హానీ జరిగేలా ఎమ్మెల్యే బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ సర్కారు విచారణకు ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం సంబరాలు కాస్తా అతడిని చిక్కుల్లో పడేశాయి. అయితే ఇంత జరిగాకా ఎమ్మెల్యే సునిల్ శరఫ్ మాత్రం తెలివిగా తన చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి ఆదేశాల మేరకు అనుప్పుర్ జిల్లా ఎస్పీ జితేంద్ర సింగ్ పవార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునిల్ శరఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ దర్యాప్తులో శరఫ్ లైసెన్స్‌డ్ రివాల్వర్‌ని దుర్వినియోగం చేశారని తేలిందని.. అతడి లైసెన్స్ రద్దు చేశామని.. మరింత దర్యాప్తు జరుగుతోందని జితేంద్ర సింగ్ పవార్ అన్నారు. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఈ ఎమ్మెల్యే ఇలా వివాదాలతో వార్తల్లోకెక్కడం ఇదేం మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితమే రైలులో రెవా నుంచి భోపాల్‌కి ప్రయాణిస్తూ తోటి ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కుని వార్తల్లోకెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి సునిల్ శరఫ్‌కి టికెట్ ఇవ్వడం ఇక కష్టమేననే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి : Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్‌ విషెష్‌ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!

ఇది కూడా చదవండి : Girl Killed Own Mother: లవర్ పై రేప్ కేసు పెట్టిందని తల్లిని దారుణంగా చంపిన కూతురు.. రాత్రంతా శవం పక్కనే రొమాన్స్?

ఇది కూడా చదవండి : Haryana Woman Kidnap Case: కారులో కూర్చున్న మహిళని కిడ్నాప్ చేయబోయారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News