Acharya Movie Update: డైరెక్టర్ కొరటాల శివ..మెగాస్టార్ చిరంజీవి తొలి కలయికలో తెరకెక్కించిన మెజేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా 'ఆచార్య'. చిరంజీవి 152వ సినిమా విశేషాన్ని సంతరించుకున్న ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ హౌస్.. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించారు. దేవాలయ భూముల స్కాం నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో సినిమాను రూపొందించారు. ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే ప్రత్యేక పాత్రలో నటించారు. తండ్రి చిరంజీవితో అతడి స్క్రీన్ స్పేస్ దాదాపు 25 నిమిషాలు ఉంటుందని సమాచారం. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
నిజానికి ఈ మూవీ గత ఏడాదే విడుదల కావాలి. కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆచార్య మూవీ ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇంతకు ముందు విడుదలైన ఆచార్య టీజర్స్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఆచార్య ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోమని నిర్మాతలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలో ఆచార్య విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
'ఆచార్య' మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 'సైరా నరసింహారెడ్డి'మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో దీనికి పెద్ద ఎత్తున క్రేజ్ నెలకొంది. ఆచార్య సినిమా విడుదల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఏప్రిల్ 29 పెద్ద పండుగ కాబోతోంది.
ఆచార్య సినిమా విడుదలకు రెండు వారాల ముందుగా ట్రైలర్ విడుదలవుతుండడం మరింత ఆసక్తిగా మారింది. ఇక ఆచార్య మూవీ విడుదలయ్యే వారం రోజుల ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున చేయబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. కాజల్, పూజా హెగ్డే హిరోయిన్లుగా నటిస్తున్న 'ఆచార్య'చిత్రం ఏ స్థాయిలో ఓపెనింగ్స్ కొల్లగొడుతుందో వేచి చూడాలి.
Also Read: Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!
Also Read: KTR vs DK: వాళ్లను బ్యాగ్ సర్దేయండన్న కేటీఆర్.. మధ్యలో కర్ణాటక పీసీసీ చీఫ్ జోక్యం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook