SSR Facts: సుశాంత్ డైరీ రహస్యం వెల్లడించిన మాజీ ప్రియురాలు

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే ( Ankita Lokhande) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్య తనను షాక్ కు గురి చేసింది అని.. సుశాంత్ ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు అని తెలిపింది.

Last Updated : Jul 31, 2020, 11:49 AM IST
SSR Facts: సుశాంత్ డైరీ రహస్యం వెల్లడించిన మాజీ ప్రియురాలు

Secrets Of Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే ( Ankita Lokhande) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్య తనను షాక్ కు గురి చేసింది అని.. సుశాంత్ ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు అని తెలిపింది. ఆత్మహత్య ( SSR Suicide ) చేసుకునే రకం కాదని తెలిపింది. అంకితా లోఖాండే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి పలు రహస్యాలు ( Secrets Of Sushant Singh Rajput ) వెల్లడించింది.  ( Covid 19 In Telangana: తెలంగాణలో పెరుగుతోన్న రికవవరీ రేటు )

సుశాంత్ నిత్యం కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే పనిలో ఉండేవాడని తెలిపింది అంకితా. సుశాంత్ వద్ద ఒక డైరీ ఉండేది ( Sushant Singh Rajput Diary ) అని.. అందులో వచ్చే ఐదు సంవత్సరాల్లో సాధించాలి అనుకున్నలక్ష్యాలను, కలలను రాసుకునే వాడు అని వెల్లడించింది. డైరీలో రాసుకున్న ప్రతీ కలను అతను సాకారం చేసుకున్నాడు అని.. సుశాంత్ ను ప్రజలు ఒక డిప్రెసెడ్ స్టార్ లా కాకుండా ఒక హీరోలా గుర్తుంచుకోవాలని అని కోరింది అంకితా లోఖాండే. 

Manisha Koirala:  మనీషా కోయిరాలా యోగా ఫోటోకు ఫ్యాన్స్ ఫిదా

Trending News