Covid 19 In Telangana: తెలంగాణలో పెరుగుతోన్న రికవరీ రేటు

తెలంగాణో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుతోంది. ప్రతీ రోజు వెయ్యిని మించి కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 1,986 మందికి కరోనావైరస్ పాజిటీవ్ అని తేలింది. 

Last Updated : Jul 31, 2020, 10:44 AM IST
Covid 19 In Telangana: తెలంగాణలో పెరుగుతోన్న రికవరీ రేటు

తెలంగాణో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుతోంది. ప్రతీ రోజు వెయ్యిని మించి కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 1,986 మందికి కరోనావైరస్ పాజిటీవ్ అని తేలింది. ఈ కేసుల్లో అత్యధికం హైదరాబాద్ ( Hyderabad ) లోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో (GHMC) 586, మల్కాజిగిరిలో 207, రంగారెడ్డిలో 205, కరీంనగర్ లో 116, సంగారెడ్డిలో 108, వరంగల్ లో 123 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ( Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు )

వైద్య ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం గురువారం రోజు మొత్తం 816 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అదే సమయంలో 14 మంది కోవిడ్ 19 ( Covid 19 ) వల్ల ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం తెలంగాణ (Telangana ) లో మొత్తం 62,707 కోవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మొత్తం 45,388 మంది కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. ఇప్పటి వరకు 519 మంది మరణించారు. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో 16,796 మంది ప్రస్తుతం కరోనావైరస్ చికిత్స ( Active Cases in Telangana ) అందుకుంటున్నారు. అయితే తెలంగాణలో రికవరీ రేటు రోజు రోజుకూ పెగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.3శాతం ఉంది. ( కుర్రకారులో జోష్ కలిగించే జీనల్ జోషి అందాలు )

Trending News