NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాదు రాజకీయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయంగా హాట్రిక్ విజయాలను నమోదు చేశారు. ఒక రకంగా సినీ, రాజకీయ పరంగా బాలయ్య హాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. బాలయ్య నటించిన గత సినిమా ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా రూ. 130 కోట్ల గ్రాస్.. రూ. 80 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు పలు కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజుల పరుగును కూడా పూర్తి చేసుకుంది.
మరోవైపు ‘భగవంత్ కేసరి’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను నెల రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు. అక్కడ ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా నెల రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ తో అక్కడి ప్రేక్షకుల మనుసులు దోచుకుంది. పైగా భగవంత్ కేసరి సినిమా హిందీ వెర్షన్ కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఈ సినిమా స్పెషాలిటి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన ఏజ్ కు తగ్గ పాత్రలో జీవించాడు. ఈ చిత్రంలో నందమూరి నట సింహం ఎలాంటి డ్యూయట్ లేకుండా తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన ముద్ర వేసారు. అనిల్ రావిపూడి బాలకృష్ణ వయసుకు దగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చేలా రూపొందించడం విశేషం.
'భగవంత్ కేసరి' మూవీతో నందమూరి నట సింహం పలు రికార్డులను క్రియేట్ చేసారు. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో వరుసగా ఎవరు వరుసగా మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన తరం కథానాయకుల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ గా రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా బాలయ్య గెటప్, మాస్ అప్పీరియన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ‘భగవంత్ కేసరి’ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల షేర్.. రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ డిజిటల్ యుగంలో బాలయ్య నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఇరగదీయడమే కాదు.. థియేట్రికల్‌గా 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా ఓ విశేషమనే చెబుతున్నారు. బాలయ్య.. ప్రస్తుతం బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి బాలయ్య డాన్ పాత్రలో అలరించనున్నట్టు సమాచారం.
Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook