Akhanda Release Date: బాలయ్య ‘అఖండ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!.. గ్రాండ్ రిలీజ్ కు చిత్రబృందం సన్నాహాలు

Akhanda Release Date: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల(డిసెంబరు)లో సినిమాను గ్రాండ్ రిలీజ్ (Akhanda Release Date) చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 08:49 AM IST
    • బాలకృష్ణ-బోయపాటి చిత్రం ‘అఖండ’ సినిమా రిలీజుకు సిద్ధం
    • డిసెంబరు 2న విడుదల చేయనున్నారని సమాచారం
    • ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న చిత్రబృందం
Akhanda Release Date: బాలయ్య ‘అఖండ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!.. గ్రాండ్ రిలీజ్ కు చిత్రబృందం సన్నాహాలు

Akhanda Release Date: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అఖండ’. షూటింగ్​ పూర్తయినప్పటికీ లాక్​డౌన్, థియేటర్లు ఓపెన్ కాకపోవడం వల్ల చిత్ర విడుదల ఆలస్యమైంది. దీంతో ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అని బాలయ్య అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాటలు, ప్రచార చిత్రంతో ఫ్యాన్స్​ను అలరిస్తున్న 'అఖండ'.. డిసెంబరు 2న (Akhanda Release Date) ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే సినిమాలోని టైటిల్ సాంగ్ (Akhanda New Song) ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో అఘోరాగా కనిపించిన బాలయ్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం రత్నం డైలాగ్స్ అందించారు.

ఇక ఈ మూవీ కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించ‌నున్నారు. శ్రీకాంత్ (Srikanth) ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’ (Akhanda) కావడం వల్ల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Also Read: Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News