Balakrishna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!

Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో  తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 04:09 PM IST
Balakrishna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య  సినిమా..!

Balakrishna Pan India Movie: అవును ఇపుడు అందరు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ 90లలోనే బాలకృష్ణ తన సినిమాతో ప్యాన్ ఇండియాను షేక్ చేసారు. వివరాల్లోకి వెళితే.. బి.గోపాల్ దర్శకత్వంలో విజయ లక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై టి.త్రివిక్రమ్ రావు నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ మూవీ చేసారు. ఈ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు నిప్పులాంటి మనిషి,  కొండవీటి సింహం, అంకుశం తర్వాత పోలీస్ సినిమాల్లో రౌడీ ఇన్ స్పెక్టర్  ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. అప్పటి వరకు పోలీస్ పాత్రలంటే నీతి, నిజాయితీతో ఉండేవి. కానీ ఈ సినిమాలో అన్యాయం అంతం చేయడానికి పోలీసు .. రౌడీ గా మారిన తప్పులేదని ఈ సినిమాలో చూపించారు.

లారీ డ్రైవర్ మూవీ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమాలో బాలయ్య సరసన విజయ శాంతి నటించారు. మిగతా పాత్రల్లో హరీష్, మోహన్ రాజు, కెప్టెన్ రాజు, సాయి కుమార్, రాఖీ, నిర్మలమ్మ, కోట, జగ్గయ్య తదితరులు నటించారు. ఈ సినిమాల బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన 16వ చిత్రం. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో నటించారు.

ఆరోజుల్లోనే ఈ సినిమా 35 సెంటర్స్ లలో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు పలు కేంద్రాల్లో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాను తమిళంలో ‘ఆటోరాణి’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక హిందీలో ఈ సినిమాను ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ టైటిల్ తోనే డబ్ చేసి రిలీజ్ చేస్తే .. అప్పటి వరకు ముంబైలో అత్యధిక కలెక్షన్స్ వసూళు చేసిన హిందీ డబ్బింగ్ చిత్రంగా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక రకంగా అప్పట్లోనే ప్యాన్ ఇండియాను షేక్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది రౌడీ ఇన్ స్పెక్టర్.  ఈ చిత్రంలో బాలయ్య.. ఇన్ స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. ఆటోరాణిగా విజయశాంతి నటించింది. బొబ్బర్ లంక రామబ్రహ్మం పాత్రలో మోహన్ రాజ్ విలన్ గా నటించారు. కోట శ్రీనివాస రావు మరో కీలక పాత్రలో నటించారు.

‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ హిందీలో అదే టైటిల్‌తో డబ్ చేస్తే.. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ముంబైలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. విజయశాంతి ‘ఆటో రాణిగా మెప్పించారు. ఇక బొబ్బర్ లంక రామబ్రహ్మంగా మోహన్ రాజ్ తనదైన విలనిజం పండించారు. ఈ సినిమాకు ఆంజనేయ పుష్పానంద్ కథను అందిస్తే.. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు. వియస్ఆర్ స్వామి కెమెరా మెన్ గా పనిచేసారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ రావు నిర్మాణంలో బాలయ్య.. ‘బొబ్బిలి సింహం’ సినిమా చేసారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా రౌడీ ఇన్ స్పెక్టర్.. 90లలో బాక్సాఫీస్ ను ప్యాన్ ఇండియా లెవల్లో షేక్ చేసిన చిత్రంగా నిలవడం విశేషం.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News