Shilpi Raj MMS Post: ఎమ్మెమ్మెస్ లీక్ తో క్రేజ్.. సూసైడ్ అనుమానాలు కలిగించేలా సింగర్ పోస్ట్!

Bhojpuri singer Shilpi Raj Suicidal Post: గతంలో పర్సనల్ ఎమ్మెమ్మెస్ ఒకటి లీక్ అయిన భోజ్‌పురి సింగర్ శిల్పి రాజ్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే   

Last Updated : Nov 23, 2022, 05:41 PM IST
Shilpi Raj MMS Post: ఎమ్మెమ్మెస్ లీక్ తో క్రేజ్.. సూసైడ్ అనుమానాలు కలిగించేలా సింగర్ పోస్ట్!

Bhojpuri singer Shilpi Raj Suicidal Post: గతంలో భోజ్‌పురి సింగర్ శిల్పి రాజ్ ఎమ్మెమ్మెస్ ఒకటి లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇక తాజాగా సింగర్ శిల్పి రాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకరకంగా ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనడం కంటే దుమారం రేపుతోంది అనడం కరెక్ట్. నిజానికి శిల్పి రాజ్ పోస్ట్‌లో కాస్త వింతగా రాసి ఉండడంతో, అది చదివి ఆమె ఆత్మహత్య చేసుకోబోతోందని అందరూ భావించారు.

ఈ దెబ్బతో ఆమె ఈ పోస్ట్ చేసినప్పటి నుండి శిల్పి రాజ్ అభిమానులు కలత చెందారు. …శిల్పి రాజ్ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, 'నేను ఏ పనీ బాగా చేయలేను (1) చదువులు, (2) లేదా సంగీతం... నేను ఏమిటి? అసలు నిజం చెప్పాలంటే, నేను కీలుబొమ్మగా మారాను.. అని రాశారు. .ఏం చెయ్యాలో తెలియట్లేదు (అమ్మా) నువ్వు ఒక్కడివే నన్ను ఆపివేసావు! కానీ, ఇప్పుడు ఈ ప్రపంచంలో జీవించాలని అనిపిస్తోంది... క్షమించండి.' అంటూ ఆమె ఒక మెసేజ్ షేర్ చేసింది.

దీంతో ఆమె చనిపోతుందంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ 'నేను పూర్తిగా బాగున్నాను, కొద్దిగా పని ఒత్తిడి ఉంది, ఈ ఒత్తిడి కారణంగానే నేను ఇలాంటి పోస్ట్ రాశాను. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. శిల్పి రాజ్ యుపిలోని డియోరియా నివాసి, ఖేసరి లాల్ యాదవ్, పవన్ సింగ్ వంటి చాలా మంది భోజ్‌పురి సూపర్ స్టార్‌లతో ఆమె కలిసి పనిచేశారు. ఇక మరోపక్క ఆమె కొత్త వీడియో సాంగ్ 'లాల్ లాల్ ఒతావ తోహర్' (లాల్ లాల్ ఒతవ తోహర్) ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఈ సాంగ్ లో నీల్కమల్ సింగ్ నటి సృష్టి ఉత్తరాఖండితో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వీరిద్దరి మధ్య అమేజింగ్ కెమిస్ట్రీ కనిపిస్తోండగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆ పాటను మళ్లీ మళ్లీ చూడడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రతిసారి లాగానే ఈసారి కూడా తన బోల్డ్ యాక్టింగ్‌లతో దూసుకుపోయింది సృష్టి. 
Also Read: Krish New Look: డైరెక్టర్ క్రిష్ బట్టతలపై మొలకలొచ్చాయ్... న్యూ లుక్ చూశారా?

Also Read: Kantara OTT Release: ఓటీటీలోకి కాంతార.. అఫీషియల్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు ఎందులో అంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News