Shankar Jai Kishan: FNCCలో ఘనంగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జైకిషన్ సంగీత విభావరి.. హాజరైన సినీ ప్రముఖులు..

Shankar Jai Kishan: శంకర్ జై కిషన్ బాలీవుడ్‌లో ఫేమస్ సంగీత ద్వయం. ఈయన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. తెలుగులో కూడా ఈ సంగీత దర్శకులు పనిచేసారు. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్ ఎన్ సీ సి క్లబ్‌లో ఆల్ ఇండియా బ్రిడ్డ్ 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జై కిషన్ స్వరపరిచిన గీతాలను తలచుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2024, 12:50 PM IST
Shankar Jai Kishan: FNCCలో ఘనంగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జైకిషన్  సంగీత విభావరి.. హాజరైన సినీ ప్రముఖులు..

Shankar Jai Kishan: అసలు సంగీత ప్రపంచంలో ఇద్దరు సంగీత దర్శకులు కలిసి సంచలనాలు నమోదు చేయవచ్చనే విషయం శంకర్ జై కిషన్‌తోనే మొదలైంది. ఆ తర్వాత కళ్యాణ్ జీ ఆనందజీ,  దక్షిణాదిన కూడా రాజన్ నాగేంద్ర, రాజ్ కోటి వంటి ప్రముఖ సంగీత దర్శక ద్వయాలు ఏర్పడానికి ఆద్యులు శంకర్ జై కిషన్ అనే చెప్పాలి. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జీవిత చక్రం' సినిమాకు శంకర్ జై కిషన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులు హమ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా  హైదరాబాద్ ఫిలిం నగర్ లోని FNCC క్లబ్ ఆధ్వర్యంలో  ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసారు.   ఈ సంగీత విభావరికి  ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు , సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు. ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డితో పాటు FNCC మెంబర్స్ కాజా సూర్యనారాయణ , బాలరాజు, ఏడిద సతీష్ (రాజా), సామా ఇంద్రపాల్ రెడ్డి , వరప్రసాద రావు ,  ఓల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, , డైరెక్టర్ బి. గోపాల్, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి భరద్వాజ్,  శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మితో పాటు..  లక్ష్మి నారాయణ, గురువారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ్మిరెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ : 
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన లక్ష్మి గారికి, గురువా రెడ్డి గారికి, మురళికి  ధన్యవాదాలు. ఈ చల్లని సాయంత్రం మంచి మ్యూజిక్ తో ఆహ్లాదకరంగా సాగిందంటూ కొనియాడారు. 

శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి  మాట్లాడుతూ.. 
 ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారికి ఇంత అందమైన వేదిక ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి సాయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియాజేసారు.  శంకర్ జైకిషన్ ఫ్యాన్ అసోసియేషన్ 2014 లో స్థాపించారు.  కారణం నేటి సినిమా పాటలలో మెలోడీ పాటలు తగ్గిపోయాయి. పాత రోజుల్లో పాటలు ఎంత మధురంగా ఉండేవో నేటి యువతకి తెలిసేలా చేయాలి. గోల్డెన్ ఎరా లో అన్ని పాటలు బావుండేవి.  అందరూ బాగా సంగీతం అందించేవారు.  వారిలో ఒకరైన శంకర్ జైకిషన్ పేరు పెట్టుకున్నాము. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు వైద్య సాయం చేయడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నామమన్నారు.  భారత దేశం లో ఓ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఫండ్స్ అడిగినప్పుడు మొదటిగా శంకర్ జైకిషన్ గారు ముందుకు వచ్చారు. అందుకే ఆయన అంటే మాకు ఎంతో అభిమానం. అదేవిధంగా ఎంతోమందికి ఆపరేషన్ల కోసం సహాయం చేశారు. ఆలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. అదే బాటలో మేము గతంలో కొన్ని కొంతమందికి హెల్ప్  చేయడం జరిగింది. ఈ యేడాది ఈశ్వర్ చంద్ర హాస్పిటల్స్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీస్ ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాము. ఒకపక్క మంచి మెలోడీ సాంగ్స్ అందిస్తూనే శంకర్ జై కిషన్ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు చేసిన సహాయాన్ని కొనియాడారు. గురువారెడ్డి  చాలా మంచి వైద్యులు అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు. 

ఎఫ్ ఎన్ సి సి సభ్యులు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ :

గురువారెడ్డి నూతనంగా హాస్పిటల్ మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. దుక్కిపాటి నరసింహారావు నాకు చాలా  సన్నిహితులు. లక్ష్మి ఇలా ఓ కార్యక్రమం నిర్వహించడం  సంతోషకరంగా ఉంది. ఎఫ్ ఎన్ సి సి ఏర్పడటంలో తన వంతు కృషి ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అని, తనతో కలిసి పని చేయడం తనకి ఆనందం అన్నారు.

గురువారెడ్డి గారు మాట్లాడుతూ :

 సంగీతం హృదయాలను కదిలేల చేస్తుంది. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయనేది అందరు చెప్పుకుంటారు.  నేను ఈ సంగీత ద్వయాన్ని ఎపుడు కలవలేదు కానీ ఆయన మ్యూజిక్  అంటే చాలా ఇష్టం. నేను పాటలు పాడను కానీ వాటిని విని ఆస్వాదిస్తాను. అలాగే నా హాస్పిటల్లో ఎఫ్ ఎన్ సి సి సభ్యులకు మంచి మెడికల్ ప్యాకేజ్ ఇస్తాను. నాకు కళాకారులున్నా.. కళా పోషన్ అన్న ఎంతో ఇష్టం. ,మీకు సేవ చేయడం నాకు ఇష్టం. రచయితలు, కళాకారులు, గాయకులూ తనకు ఎంతో గౌవరమన్నారు. 
ప్రముఖులు మాట్లాడిన అనంతరం శంకర్ జైకిషన్ ప్రముఖ పాటలతో కార్యక్రమం కొనసాగింది. వచ్చిన వారు చల్లని వేళ ఈ సంగీత కార్యక్రమంలో మధురమైన పాటలను విని మైమరిచిపోయారు. 
Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News