Bigg Boss 7 Telugu: ఫస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఆ 8 మంది.. ఓటింగ్‏లో దూసుకుపోతున్న రైతు బిడ్డ..

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నామినేషన్స్ షురూ అయ్యాయి. మెుత్తంగా 14 మంది నామినేట్ అయ్యారు. నామినేషన్ల రచ్చతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 07:38 PM IST
Bigg Boss 7 Telugu: ఫస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఆ 8 మంది.. ఓటింగ్‏లో దూసుకుపోతున్న రైతు బిడ్డ..

Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. దీంతో షో నామినేషన్స్ తో హీటెక్కింది. మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో శోభాశెట్టి, రతిక, ప్రిన్స్ యవర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, షకీలా, గౌతమ కృష్ణ, సింగర్ దామిని ఉన్నారు. 

సెప్టెంబరు 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మెుదలైంది. అయితే గత సీజన్ల మాదిరిగా కాకుండా.. ఈ సారి ఓటింగ్ వేసే విధానాన్ని చేంజ్ చేశారు. ఈసారి ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికీ వరకు తెలిసిన సమాచారం మేరకు, రైతు  బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. అతనికి ఊహించని రేంజ్ లో ఓట్లు పడుతున్నాయి. ఇతని తర్వాత ప్లేస్ లో యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ప్రశాంత్ తర్వాత ఇతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

ఆ తర్వాత హీరోయిన్ రతిక మూడో స్థానంలోనూ.. షకిలా, దామిని, ప్రిన్స్ యవర్, శోభాశెట్టి కొనసాగుతున్నారు. చివరి ప్లేస్ లో కిరణ్ రాథోడ్ ఉంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఆమెకే పడ్డట్లు తెలుస్తోంది. ఆమె పెద్దగా తెలియకపోవడం, తెలుగు రాకపోవడం కిరణ్ కు మైనస్ అయ్యాయి. ఓటింగ్ క్లోజ్ అవ్వడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, ఆట సందీప్, టేస్టీ తేజ సేఫ్ సైడ్‍లో ఉన్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BIGG BOSS 7 TELUGU (@officialbigboss7telugu)

Also read: Jawan Movie: రిలీజ్ కు ముందే 'జవాన్' జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'పఠాన్' రికార్డు బ్రేక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News