Devullu Child Artist : మందు కొడుతున్న 'దేవుళ్లు' పాప.. నిత్యా శెట్టి పిక్ వైరల్

Devullu Fame Child Artist దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి పిల్లలు ఎంతగా ఫేమస్సో అందరికీ తెలిసిందే. అందులోని పాప ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. నిత్యా శెట్టి చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు బాగానే క్రేజ్ తెచ్చుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 09:20 AM IST
  • నిత్యా శెట్టి నెట్టింట్లో సందడి
  • డ్రింక్ చేస్తున్నట్టుగా పోస్ట్
  • దేవుళ్లు పాప పోస్ట్ వైరల్
Devullu Child Artist : మందు కొడుతున్న 'దేవుళ్లు' పాప.. నిత్యా శెట్టి పిక్ వైరల్

Nithya Shetty About Drinking దేవుళ్లు సినిమాలో చిన్న పిల్లలుగా నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్టులకు మంచి క్రేజ్ వచ్చింది. నీ ప్రేమ కోరే అంటూ పాటలో అదరగొట్టేశారు పిల్లలిద్దరూ. ఇప్పుడు అందులో నటించిన పాప.. హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. నిత్యా శెట్టి వరుస సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే నిత్యా శెట్టి సోషల్ మీడియాలోనూ ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యా శెట్టి.. నువ్వు తోపురా అనే సినిమాలో నటించింది. అంతకు ముందు ఓ తమిళ సినిమాలోనూ కనిపించింది. తమిళ బుల్లితెరపై ఓ షోలోనూ మెరిసింది. అయితే తెలుగులో పిట్ట కథలోనూ నటించింది. ఇక ఆమె చేసిన వెబ్ సిరీస్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. నిహారిక తెరకెక్కించిన వెబ్ సిరీస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అందులో నిత్యా శెట్టి నటించిన, కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

హలో వరల్డ్ అంటూ వెబ్ సిరీస్‌లో నిత్యా శెట్టి కనిపించింది. ఈ సిరీస్‌ యూత్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఇందులో నిత్యా శెట్టి అందంగా కనిపించింది. వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలోనూ తన మార్క్ వేసింది నిత్యా శెట్టి. పడేశావే అనే మరో చిన్న సినిమాలోనూ ఆమె కనిపించింది. ఇక ఇప్పుడు నిత్యా శెట్టి 3c's అనే సినిమాలో నటిస్తోంది.

అయితే నిత్యా శెట్టి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన దేవుళ్లు, అంజి సినిమాలు అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. అలా నిత్యా శెట్టికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నిత్యా శెట్టి.. తాజాగా షాక్ ఇచ్చింది. తన ఫ్రెండ్ చాలా రోజులకు కలిసినట్టుంది. ఇలా ఇద్దరూ కలిసి ఫుల్ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మందు గ్లాసు ముందు పెట్టుకుని పెగ్గు వేసేందుకు రెడీ అయినట్టు అనిపిస్తోంది.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News