Ala Ninnu Cheri: 'అలా నిన్ను చేరి' ప్రమోషన్స్ షురూ.. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన క్రిష్

Ala Ninnu Cheri Movie Title Song: అలా నిన్ను కోరి మూవీ టైటిల్ సాంగ్‌ను డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు. త్వరలో ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు మూవీ మేకర్స్.    

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 11:28 AM IST
Ala Ninnu Cheri: 'అలా నిన్ను చేరి' ప్రమోషన్స్ షురూ.. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన క్రిష్

Ala Ninnu Cheri Movie Title Song: ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి మారేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, స్పెషల్ పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి చేతుల మీదుగా 'అలా నిన్ను చేరి' టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను ఆయన అభినందించారు. 

టైటిల్ సాంగ్ చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మంచి విజువల్స్‌లో షూట్ చేసిన పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అన్నారు. ఈ సాంగ్ లిరిక్స్‌ను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. సుభాష్‌ ఆనంద్ మ్యూజిక్ అందించారు. ఎంతో ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో సాంగ్‌ను షూట్ చేసినట్లు చిత్రబృందం సభ్యులు తెలిపారు. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందన్నారు. ఈ సినిమాకు అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని.. కుటుంబ సమేతంగా చూసేవిధంగా ఉంటుందన్నారు. సుభాష్‌ ఆనంద్ సంగీత దర్శకత్వం వహించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుందని.. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపింది. అలా నిన్ను కోరి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది.

Also Read: Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!   

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News