Christmas Weekend: క్రిస్మస్ కే గేం చేంజర్..మరో మూడు సినిమాలు కూడా?

Competetion for Christmas 2023 Race: నిమా అవుట్ పుట్ చేతికి వచ్చి సంక్రాంతికి డేట్ దొరకని సినిమాలను చాలావరకు క్రిస్టమస్కే రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్, ఇక ఇప్పటికే మూడు సినిమాలు లిస్టులో ఉండగా రామ్ చరణ్ సినిమా కూడా రేసులో దిగే అవకాశం ఉందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 10, 2023, 09:15 PM IST
Christmas Weekend: క్రిస్మస్ కే గేం చేంజర్..మరో మూడు సినిమాలు కూడా?

Huge Competetion for Christmas 2023 Race: ఒకప్పుడు ఒక్కొక్క భాషకు సంబంధించిన సినిమాల మధ్య పోటీ ఉండేది కానీ ఇప్పుడు దాదాపుగా చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల మేకర్స్ తెరకెక్కిస్తూ ఉండడంతో తాము తెరకెక్కిస్తున్న సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఇతర భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలు కూడా రిలీజ్ డేట్లు క్లాష్ రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది క్రిస్టమస్ కి పలు భారీ ప్రాజెక్టులు ఒకదానితో మరోటి పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సాధారణంగా సంక్రాంతికి ముందు క్రిస్టమస్ ని కూడా సినిమాలకు మంచి సీజన్ గానే ట్రేడ్ అనలిస్టులు భావిస్తూ ఉంటారు.  సినిమా అవుట్ పుట్ చేతికి వచ్చి సంక్రాంతికి డేట్ దొరకని సినిమాలను చాలావరకు క్రిస్టమస్కే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే నాని హీరోగా నటిస్తున్న 30వ సినిమాతో పాటు వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైంధవ్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న హరోంహరా వంటి సినిమాలు దాదాపు క్రిస్మస్ వీకెండ్ కి రిలీజ్ అవ్వడం ఖాయంగానే తెలుస్తుంది. ఈ లిస్టులో హరోంహరా సినిమా తాజాగా ఆడ్ అయింది.

Also Read: Adipurush Buy one get one: ఆదిపురుష్ చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరోటి ఫ్రీ!

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లిస్టులో మరో పెద్ద సినిమాతో పాటు చిన్నాచితకా సినిమాలు కూడా ఆడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వెంకటేష్ సైంధవ్ సుధీర్ బాబు హరోంహరా సినిమాలు యాక్షన్ బేస్డ్ గా తెరకెక్కుతూ ఉండగా నాని హీరోగా తెరకెక్కుతున్న 30వ సినిమా మాత్రం తండ్రి కూతుర్ల సెంటిమెంట్ మీద ఆధారంగా తెరకెక్కుతున్న ఒక ఎమోషనల్ ఫిలిం అని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాల్లో మొదటి ప్రిఫరెన్స్ నాని సినిమాకి తర్వాత వెంకటేష్ సినిమాకి ఆ తర్వాత సుదీర్ బాబు సినిమాకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నాని 30వ సినిమా వెంకటేష్ సైంధవ్ సంగతి పక్కన పెడితే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోంహర సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని 1989లో జరిగిన ఒక పీరియాడిక్ డ్రామా అని చెబుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజెర్ సినిమా దాదాపుగా సంక్రాంతికి రిలీజ్ కావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతకంటే ముందే పూర్తయితే ఈ క్రిస్టమస్ సీజన్ కి ఆ సినిమాని కూడా బరిలో నిలిపే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Soundarya Rajinikanth: అక్క ఇంట్లో చోరీ మరువక ముందే చెల్లి ఇంట్లో కూడా.. రజనీ కూతుళ్ల ఇళ్లలో ఏమవుతోంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News