Ghani OTT Release: ఆహాలో వరుణ్ తేజ్ 'గని'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ghani OTT Release: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 11:39 AM IST
  • ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన వరుణ్ తేజ్ 'గని'
  • బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా
  • స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Ghani OTT Release: ఆహాలో వరుణ్ తేజ్ 'గని'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ghani OTT Release: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej) నటించిన లేటెస్ట్ సినిమా 'గని' (Ghani movie). బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో కథానాయికగా సయీ మంజ్రేకర్‌ నటించింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన గని.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా(aha) కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

మరోవైపు  గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు టాక్. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు 20 కోట్లకు పైగా అమ్మేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్ అన్ని కలిపితే గని సినిమా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నట్టు సమాచారం. 

Also Read: KGF Chapter 2: తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు, 5 వందల కోట్ల దిశగా కేజీఎఫ్ ఛాప్టర్ 2

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News