Jr NTR: గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌లో రిపోర్టర్ బర్త్‌డే , ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR: అంతర్జాతీయ సినీ వేదికపై తెలుగుపాటుకు అరుదైన గౌరవం లభించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవంలో..జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ రిపోర్టర్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2023, 09:56 AM IST
Jr NTR: గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌లో రిపోర్టర్ బర్త్‌డే , ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్

సినిమా పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ అందరితో కలివిడిగా, క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు. అందుకే బాలీవుడ్, హాలీవుడ్‌లో సైతం అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు. అంతర్జాతీయ రిపోర్టర్స్ కూడా అతడికి అభిమానులయ్యారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారతీయ తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్‌లోని  నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్ ప్రీషోలో జూనియర్ ఎన్టీఆర్ అక్కడి మీడియాతో మాట్లాడాడు. హాలీవుడ్ డైరెక్టర్ మార్వెల్ ఆఫర్ గురించి స్పందిస్తూ..అవకాశమొస్తే చేస్తానని చెప్పాడు. రాజమౌళితో పనిచేసినప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుందని తెలుసన్నాడు. అదే సినిమా ఇంతదూరం తీసుకొచ్చి అవార్డు ఇస్తుందని ఊహించలేదన్నారు. 

ఈ సందర్భంగా హాలీవుడ్ రిపోర్టర్ మార్క్ పుట్టినరోజు అని తెలుసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఊహించనివిధంగా స్వీట్ గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఏ మాత్రం ఊహించని రిపోర్టర్ మార్క్..సంతోషంతో జూనియర్ ఎన్టీఆర్‌ను హగ్ చేసుకున్నాడు. ఆ తరువాత ఇంటికెళ్లి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. ఆ గిఫ్ట్ బాక్స్‌లో బౌ టై చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఎన్టీఆర్‌ ది బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. 

Also read: Golden Globe to Naatu Naatu : నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఉబ్బితబ్బిబ్బైన చిరు.. చిన్నపిల్లాడిలా రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News