Hanu Man: ఆ ఏరియాలో కేజీఎఫ్ రికార్డులకు ఎర్త్ పెట్టిన హనుమాన్..

Hanu Man: హను మాన్ మూవీ ఇప్పటికే విడుదలైన సంక్రాంతి సినిమాలను వెనక్కి నెట్టేసింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా ఒక్కో రికార్డును స్మాష్ చేసుకుంటూ వెళుతున్న  ఈ మూవీ తాజాగా కేజీఎఫ్ 1 రికార్డులను మడతేట్టేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2024, 09:07 AM IST
Hanu Man: ఆ ఏరియాలో కేజీఎఫ్ రికార్డులకు ఎర్త్ పెట్టిన హనుమాన్..

Hanuman: హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావడమే కాదు.. అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర పొంగల్ విన్నర్‌గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా హిందీలో కేజీఎఫ్ 1 హిందీ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. ఈ మూవీ 18 రోజుల్లో రూ. 45 కోట్ల నెట్ వసూళ్లను సాధించి కేజీఎఫ్ 1 లైఫ్ టైమ్ వసూళ్లను దాటింది. మొత్తంగా హిందీలో ఈ మూవీ ఇంకా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. మీడియం రేంజ్ సినిమాగా విడుదలైన ఈ మూవీ ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఈ సినిమా క్లైమాక్స్‌లో చూపించినట్టు రాముడికి హనుమంతుడు ఏ మాట ఇచ్చాడనేది 'జై హనుమాన్' మూవీలో చూపించనున్నారు.

హనుమాన్ విషయానికొస్తే.. రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో టాలీవుడ్‌లోనే.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ.
సంక్రాంతి గట్టిపోటీలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'గుంటూరు కారం" సినిమా ఉన్న ఆ సినిమాతో పోటీని తట్టుకొని నిలబడింది హనుమాన్.

తొలి రోజు ముందు నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రారంభమైన హనుమాన్ దూకుడు ఇప్పటికీ  కొనసాగుతూనే ఉంది. ఇక యూఎస్ (అమెరికా) బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ $5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ.30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ.115 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రూ. 270 కోట్ల గ్రాస్.. రూ. 150 కోట్ల షేర్ రాబట్టి సంక్రాంతి సినిమాలతో పాటు జనవరి నెలలో  అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News