HBD Ram Charan: పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్‌ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు హీరోలు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 27, 2024, 02:07 PM IST
HBD Ram Charan: పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

HBD Ram Charan: రామ్ చరణ్ 39వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు గ్లోబల్ స్టార్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ .. ఆస్కార్ అవార్డులు పొందిన సినిమాలో నటించిన గ్లోబల్‌ స్టార్ అయిన రామ్ చరణ్‌కు నా హృదయపూఐర్వక జన్మదిన శుభాకాంక్షలు. చరణ్‌కు సంపూర్ణమైన  ఆనందాన్ని... సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవ మర్యాదలతో మెలుగుతూ ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే అతనికి శ్రీరామ రక్ష. భవిష్యత్తులో రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయన్నారు. తండ్రి తగ్గ తనయుడిగా ముందుకు దూసుకుపోతున్న చరణ్‌కు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

అటు మరో బాబాయి నాగబాబు కూడా బర్త్ డే విషెస్ తెలియజేసారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అటు అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. అటు సీనియర్ హీరో వెంకటేష్ కూడా రామ్ చరణ్‌కు పుట్టినరోజు సందర్భంగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసారు.

రామ్ చరణ్ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. బుచ్చిబాబు సనాతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు సుకుమార్‌, తాజాగా ప్రశాంత్ నీల్‌లను లైన్‌లో పెట్టి దూకుడు మీదున్నాడు.

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

Also read: Lenovo M11 Tab: 7వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబి ర్యామ్‌తో చాలా తక్కువ ధరకే లెనోవో ట్యాబ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News