Hi Nanna Box Office: బాక్సాఫీస్ వద్ద హాయ్ నాన్న దూకుడు... అక్కడ మహేష్ తర్వాత నానినే..!

Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని నయా మూవీ హాయ్ నాన్న బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా ఈ మూవీ యూఎస్ లో 1 మిలియన్ మార్కును క్రాస్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 01:43 PM IST
Hi Nanna Box Office: బాక్సాఫీస్ వద్ద హాయ్ నాన్న దూకుడు... అక్కడ మహేష్ తర్వాత నానినే..!

Hi Nanna Box Office Collections: ఇటీవల 'హాయ్‌ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). డిసెంబరు 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా అద్భుతమైన కలెక్షన్ తో దూసుకుపోతుంది. తెలుగులో మంచి వసూళ్రు రాబడుతునన ఈ మూవీ.. యూఎస్‌ఏలో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీ 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఈ ఫీట్ ను తొమ్మిదోసారి క్రాస్ చేసిన నాని సినిమాగా నిలిచింది. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (11) తొలి స్థానంలో ఉన్నారు.  ఈ చిత్రంలో నాని, కియారా, మృణాల్ నటనకు కంటతడి పెట్టని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. అంతలా ఎమోషన్ పండించారు. మిగతా వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ఆడియెన్స్ ను మెసర్మెజ్ చేసింది. 

శౌర్యువ్‌ (Shouryuv) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించింది. శృతిహాసన్‌ గెస్ట్ రోల్ లో నటించింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో బేబి కియారా ఖన్నా, జయరాం, అంగద్ బేడీ, నాజర్, విరాజ్ ఆశ్విన్ కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో నాగార్జున ఫైర్.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News