Adipurush: ప్రభాస్ మూవీపై ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ గాసిప్

టాలీవుడ్ ( Tollywood ) నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ ( Prabhas ) సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ వేచి చూస్తుంటారు.

Last Updated : Sep 27, 2020, 08:30 PM IST
    • టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ వేచి చూస్తుంటారు.
    • మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్ అయితే మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వేచి చూస్తోంది.
    • ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ చిత్రాలకు కమిట్ అయ్యాడు అని తెలిసిందే.
Adipurush: ప్రభాస్ మూవీపై ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ గాసిప్

టాలీవుడ్ ( Tollywood ) నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ ( Prabhas ) సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ వేచి చూస్తుంటారు. మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్ అయితే మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వేచి చూస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ చిత్రాలకు కమిట్ అయ్యాడు అని తెలిసిందే. ఇందులో పూజా హేగ్డే కథానాయికగా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్, టీ సిరీస్ నిర్మిస్తోన్న ఆదిపురుష్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ఒక చిత్రం కూడా ఉంది.

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

ఆదిపురుష్ ( Adipurush ) చిత్రాన్ని ఓం రావత్ తెరకెక్కిస్తోండగా.. ఈ మూవీలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే సీతాదేవీ పాత్రలో ఎవరు కనిపించనున్నారో అనే విషయంపై ఎన్నో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సీతాదేవి పాత్రలో నటిస్తోంది అని ఎన్నో గాసిప్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదు అని ఇటీవలే స్పష్టత వచ్చింది.

అయితే ఆదిపురుష్ చిత్రంలో సీతాదేవీ, లక్ష్మణుడు, ఆంజనేయుడి పాత్రలో ఎవరు నటించనున్నారో అనే విషయంపై ఇటీవలే మరో గాసిప్ చక్కర్లు కొడుతోంది.  దీని ప్రకారం ఈ పాత్రలో ఎవరు నటించనున్నారో అనేది అక్టోబర్ లో తెలియనుందట. డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిపురుష్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న నటీనటుల వివరాలు వెల్లడిస్తారట. ఆదిపురుష్ చిత్రం 2021లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2022లో విడుదల కానుంది. 

ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News