Kantara Becomes All time Top 8 South Indian Grosser: రిషబ్ శెట్టి స్వయంగా హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు కేవలం ఈ సినిమాని కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కన్నడ రాష్ట్రంలో వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కూడా దాన్ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడం మాత్రమే కాదు కేవలం 16 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రభాస్ సాహో సినిమా కలెక్షన్స్ కూడా చేసి సౌత్ ఇండియా నుంచి ఎనిమిదవ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది.
మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి, కేజిఎఫ్, 2.0, బాహుబలి, పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ కాంతార చాలా తక్కువ బడ్జెట్ తో స్టార్ క్యాస్ట్ లేకుండా రూపొందించిన సినిమా. ఈ సినిమా 410 కోట్ల రూపాయల కలెక్షన్లు ఇప్పటివరకు రాబట్టింది. అయితే ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో ప్రభాస్ సహా స్టార్ హీరోయిన్స్ మరికొందరు బాలీవుడ్ స్టార్లు ఉన్నా సరే 405 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది.
ఈ నేపద్యంలో కాంతార సినిమా ఇప్పుడు ఎనిమిదవ హైయెస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం గ్రాసర్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే నార్త్ లోనే మన సినిమాలకు మంచి వసూళ్లు అయితే లభిస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలకు ఆసక్తి చూపిస్తున్న నేపద్యంలో మన సినిమాలకి అక్కడ మంచి డిమాండ్ అయితే ఏర్పడుతోంది. స్వయంగా తానే రాసుకుని డైరెక్ట్ చేసి హీరోగా ఈ సినిమాలో నటించారు రిషబ్ శెట్టి.
ఈ సినిమాలో ఆయన భూత కోలా అనే ఒక నృత్యాన్ని చేస్తారు అది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమాని కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ పెద్ద ఎత్తున విడుదల చేసింది. తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. రెండు కోట్ల రూపాయల హక్కులతో తెలుగులో కొనుగోలు చేయగా సుమారు 70 కోట్ల దాకా ఈ సినిమా వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Also Read: వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో సంచలనం!
Also Read: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook