MAA Elections 2021: నామినేషన్ వేసిన మంచు విష్ణు.. పవన్ పై సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు.. అవేంటో మీరే చూడండి....  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2021, 05:13 PM IST
  • మా ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ మంచు విష్ణు
  • పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించను అని చెప్పిన విష్ణు
  • ఎన్నికల తరువాత నాన్నగారే పవన్ కు సమాధానం చెబుతారు
MAA Elections 2021: నామినేషన్ వేసిన మంచు విష్ణు.. పవన్ పై సంచలన వ్యాఖ్యలు

Manchu Vishnu Nomination: అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (Movie Artists Association) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారుస్తున్నాయి. నామినేషన్ ప్రకియ మొదలవగా ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj), సీవీఎల్‌ నరసింహారావు (CVL Narasimha Rao) ఇరువురు వారి ప్యానెల్ తో నామినేషన్‌ వేయగా ఈ రోజు మంచు విష్ణు (Manchu Vishnu) నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం విష్ణు విలేకర్లతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

"మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నా కుటుంబంలాంటిది, ఇది  తెలుగు నటులు ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో (MAA Elections 2021) రాజకీయ పార్టీల జోక్యం ఉండకూడదు అనుకుంటున్నా కానీ, నా వెనుక జగన్ ఉన్నారని మీడియా రాస్తుంది. కానీ నాకు 900 మంది సభ్యుల మద్దతు వుందని" ప్రెస్ మీట్ లో మంచు విష్ణు తెలిపారు. 

Also Read: Breaking News: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఎలక్షన్స్ తరువాత పవన్ కళ్యాణ్ కు సమాధానం
నా మ్యానిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ఓట్లు వేస్తారు. పవన్ పవన్‌కల్యాణ్‌గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను, 'మా' ఎలక్షన్స్ పూర్తైన తరువాత స్వయంగా నాన్నగారే (Mohan Babu) పవన్ కళ్యాణ్ గారికి సమాధానం ఇస్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్‌ (Telugu Film Industry Chamber) ఇచ్చిన లేఖకు నేను కట్టుబడి ఉంటా... ఈ విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ ఏ వైపు ఉంటారో చెప్పాలి అన్నారు. 

మంచు విష్ణు ప్యానల్ లో...
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్:  బాబు మోహన్, జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు, ట్రెజరర్: శివ బాలాజీ, జనరల్ సెక్రటరీ: రఘుబాబు వంటి ప్రముఖ నటులు ఉన్నారు. 

Also Read: Kohli's Shirtless Photo: షర్ట్ లేకుండా టీమిండియా కెప్టెన్... వైరలైన విరాట్ కోహ్లీ ఫోటోస్

మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న ఈసీ సభ్యులు...
సంపూర్ణేశ్ బాబు, అర్చన, స్వప్నమాధురి, విష్ణు బోపన్న, వడ్లపట్ల, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మేర్లపాక శైలజ, పూజిత, రాజేశ్వరిరెడ్డి, రేఖ, శశాంక్, శివనారాయణ,  శ్రీలక్ష్మి,  శ్రీనివాసులు ఈసీ సభ్యులు ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News