Lavanya Tripathi: పుట్టిన రోజు సందర్భంగా లావణ్య త్రిపాఠి సర్ప్రైజ్.. సతీ లీలావతి గా మెగా కోడలు..

Lavanya Tripathi next movie: లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా డిసెంబర్ 15న, లావణ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 15, 2024, 03:41 PM IST
Lavanya Tripathi: పుట్టిన రోజు సందర్భంగా లావణ్య త్రిపాఠి సర్ప్రైజ్.. సతీ లీలావతి గా మెగా కోడలు..

Lavanya Tripathi Upcoming Movies: గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో కనిపించిన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ఇప్పుడు సతీ లీలావతి అనే సినిమాలో నటిస్తోంది. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 15న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. తన డిఫరెంట్ పాత్రలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న లావణ్య ఈ చిత్రంలో మరొక భిన్నమైన పాత్రలో కనిపించనుంది అని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

 

 

ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. మరి ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి ఎంతవరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి. 

వరుస ఫ్లాప్స్ అందుకుంటున్న మెగా కోడలు 2021లో చావు కబురు చల్లగా సినిమాతో పర్వాలేదు అనిపించినా.. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్డే సినిమాతో మాత్రం మళ్లీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ సినిమాతో అయినా లావణ్య మళ్ళీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని ఫాన్స్ ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News