Kalki Reduced Tickets Rates: సలార్ సినిమా.. తర్వాత ప్రభాస్ కల్కి 2898 ఏడి.. సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో జూన్ 27న థియేటర్లలో.. విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు.. అందుకుంటూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మైథిలాజికల్ ఫాంటసీ.. సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా.. భారీ తారాగణంతో ప్రేక్షకులకు కనులవిందు చేస్తోంది.
చాలామంది స్టార్ నటినటులు.. కామియో పాత్రలలో కనిపించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమాలోని అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్లు.. ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. మామూలు ప్రేక్షకులతో.. పాటు సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షము కురిపిస్తున్నారు.
మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు అందుకున్న.. ఈ చిత్రం మొదటి వారంతం పూర్తయ్యేసరికి 500 కోట్లకు పైచిలుకు కలెక్షన్లు.. నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. కాక ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి కలెక్షన్లు అందుకుంది. సినిమా విడుదలైన రోజు నుంచి.. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా బాగుండడంతో మొదటి వారంతం పూర్తయ్య దాకా.. ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వచ్చారు.
కానీ ఇప్పుడు వారాంతం పూర్తయిపోయింది. సోమవారం నుంచి అదే రేంజ్ కలెక్షన్లు వస్తాయో.. లేదో చెప్పలేం. వస్తే పర్వాలేదు కానీ.. రాకపోతే మాత్రం కలెక్షన్లు భారీగా పడిపోతాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు సినిమా విషయంలో.. ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగో వారాంతం పూర్తయిపోయింది.. కాబట్టి టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు సినిమా చూడటానికి.. ఆసక్తి చూపిస్తారని, కనీసం సింగిల్ స్క్రీన్స్ వరకు.. అయిన టికెట్ రేట్లు తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అది నిజం అయితే.. అభిమానులకి ఖచ్చితంగా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి టికెట్ రేట్లను.. భారీగా తగ్గించకపోయినా కొంచెం తగ్గించినా కూడా ప్రేక్షకులు.. మళ్లీ సినిమాపై ఆసక్తి చూపించొచ్చు. మూడు గంటల సినిమా కాబట్టి టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే.. మళ్ళీ సినిమా చూడాలన్న ఆసక్తి రాదు. కనీసం టికెట్ రేట్లు తగ్గించిన కొంతవరకు ఉపయోగముండొచ్చు. మరి ఈ నిర్ణయం వల్ల కల్కి కలెక్షన్లు పెరుగుతాయో లేదో చూడాలి.
Also Read: NTR Bharosa Scheme: జగన్, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?
Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter