Kalki2898AD: 9 పార్టులుగా రానున్న కల్కి2898AD.. నిజమెంత?

Kalki 2898AD: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 06:22 PM IST
Kalki2898AD: 9 పార్టులుగా రానున్న కల్కి2898AD.. నిజమెంత?

Nag Ashwin Kalki Franchise: సలార్ చిత్రం సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ కల్కి2898AD. దీనికి తోడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు ఎన్నో ఆసక్తికరమైన రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు కల్కి మూవీ పైనే ఉంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం మొత్తం తొమ్మిది భాగాలుగా వస్తుంది అని టాక్. ప్రస్తుతం నడుస్తున్న సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ను కల్కి మూవీ కూడా ఫాలో కాబోతోంది అని గాసిప్ వినిపిస్తోంది.

కల్కి మూవీలో ప్రభాస్ లుక్స్ ను బట్టి అతను ఓ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు అన్న విషయం అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి నిజంగా తొమ్మిది భాగాలుగా వస్తే.. అది ఒకే కథని బేస్ చేసుకుని ఉంటుందా లేక స్టార్ వార్స్ మాదిరిగా ఇంకొంతమంది సూపర్ హీరోలను చూపించే అవకాశం ఉందా అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ జరుగుతోంది. కానీ ఇంతకుముందు నాగ్ అశ్విన్ ఐఐటి బాంబేలో జరిగిన కార్యక్రమంలో కల్కి మూవీ కి ఫ్రాంచైజ్ ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేశారు.

ఐఐటి బాంబేలో జరిగిన కార్యక్రమంలో నాగా అశ్విన్ ను ఒక స్టూడెంట్ మూవీకి సంబంధించిన ఫ్రాంచైజ్ గురించి అడుగుతూ ..ఇది ఇండియన్ స్టార్ వార్స్ లాంటి మూవీగా మారుతుందా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇచ్చిన నాగ్ అశ్విన్.. తాను అలా అనుకోవడం లేదని ఇది ఇండియా యొక్క ప్రాజెక్ట్ కె.. అంటే ఇండియన్ కల్కి మూవీ అని అన్నారు. అంతేకాదు ఈ మూవీ ఫ్రాంచైజ్ లాగా మారదు అని స్పష్టం కూడా చేశారు. అయితే ఈ విషయం జరిగి చాలా రోజులు గడుస్తోంది. కాబట్టి మధ్యలో నాగ్ అశ్విన్ తన ఉద్దేశాన్ని మార్చుకున్నారా లేక స్టోరీ డిమాండ్ చేయడంతో దీన్ని ఒక ఫ్రాంచైజ్ కింద మార్చబోతున్నారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తానికి ఇదే జరిగితే కల్కి మూవీ హాలీవుడ్ చిత్రాలను మించిన సెన్సేషన్ సృష్టించడం కన్ఫామ్ అంటున్నారు డార్లింగ్ అభిమానులు.

Also Readహరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Also ReadDengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News