Kalki 2898AD: కల్కి గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన నాగ్అశ్విన్... అందుకే సినిమా ఆలస్యం!

Nag Ashwin: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కల్కి షూటింగులో బిజీగా ఉన్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 07:42 PM IST
Kalki 2898AD: కల్కి గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన నాగ్అశ్విన్... అందుకే సినిమా ఆలస్యం!

Prabhas Kalki: మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో…వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898ఎడి. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఎదురుచూస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులు. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా హై లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు సినిమా యూనిట్.

నాగ్ అశ్విన్ గత చిత్రాలు ఎవడే సుబ్రహ్మణ్యం.. మహానటి రెండు కూడా మంచి విజయాలు సాధించాయి.. ముఖ్యంగా మహానటి సినిమా అయితే నంది అవార్డు కూడా గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని మరింత కాన్సన్ట్రేషన్తో ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 
 ఇప్పటికే రిలీజ్ డేట్ రెండుసార్లు వాయిదా పడటంతో నిరాశే ఎదురైంది.  కాగా కల్కి ఆలస్యానికి అసలు కారణాలేంటో నాగ్ అశ్విన్ చెప్పారు.

నాగ్ అశ్విన్ ఒక మీడియా సమావేశంలో పాల్గొంటూ కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ఇంజనీరింగ్ పనులకే చాలా సమయం పడుతోందని అందుకే సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని వెల్లడించారు. మూవీ డైరెక్ట్ చేయడం కన్నా.. టెక్నాలజీకి సంబంధించిన పనే ఎక్కువగా చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతోందన్నారాయన. ఈ చిత్రంలో కనిపించే సెట్స్‌తో పాటు ప్రతి ఆయుధం, వస్తువులను సరి కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు.. అందుకే వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని విధంగా ఈ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా భవిష్యత్తు ప్రభాస్‌ని చూస్తారని నాగ్ అశ్విన్ తెలియజేయడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి.

వైజయంతీ మూవీ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక సైన్స్ ఫిక్షన్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపిక పదుకోన్ నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..

Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News