Nawazuddin Siddiqui: చలనచిత్ర పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ ఫీలింగ్ రోజురోజుకూ అధికమౌతోంది. మాటల యుద్ధం తీవ్రమౌతోంది. ఇప్పుడు కొత్త హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఇదే విషయంపై స్పందించాడు.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 సృష్టించిన సంచలనం కాస్తా..ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా మారిపోతోంది. వాస్తవానికి కేజీఎఫ్ ఛాప్టర్ 2 కంటే ముందే బాహుబలి 1, 2లతో పాటు సాహోలు ఉత్తరాదిన దుమ్ము దులిపేశాయి. తాజాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి రాజమౌళి, ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2తో యశ్‌లు సత్తా చాటుతున్నారు. అంతేకాదు భారీగా కలెక్షన్లు సృష్టిస్తున్నాయి ఈ సినిమాలు. ఈ క్రమంలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బదులివ్వడం..ఇలా ఇరువరి మధ్య ట్వీట్ వార్ ప్రారంభమైంది. మధ్యలో ఆర్జీవీ కాస్తా అగ్గిపుల్ల అంటించేశాడు.
ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి ఒక్కొక్కరు మాటలు విసురుకుంటున్నారు. హిందీ భాష అవసరం లేదనేది దక్షిణాది వాదనగా ప్రారంభమైన మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మరో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ వ్యాఖ్యానించారు.
నవాజుద్దీన్ సిద్ధీఖీ ఏమన్నాడు
దక్షిణాది నుంచి వస్తున్న కంటెంట్ బాలీవుడ్‌ను ఓవర్ టేక్ చేస్తుందా అని అడిగినప్పుడు ..సింపుల్‌గా సమాధానమిచ్చాడు. ఏదైనా సక్సెస్ అయినప్పుడు దాని గురించే చర్చించుకుంటారని..ఇది సహజమని అన్నాడు. ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఆ ప్రభావంలో పడిపోతామని..అటువంటి కధ, మాటలు, వైఖరి ఉండాలని కోరుకుంటామని చెప్పాడు. మంచి విషయమేమంటే..ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వస్తున్నారని..మనం వారికి అందిస్తుంది వర్త్‌ఫుల్‌నా కాదా అని ఆలోచించాలని... కంటెంట్‌ని బట్టే ప్రేక్షకులు ఆదరిస్తారన్నాడు. అదే సమయంలో తాను దక్షిణాది సినిమాలే కాదు..కమర్షియల్ సినిమాలు చూడనని చెప్పుకొచ్చాడు
Also read: Gopichand: డూప్ లేకుండా నటిస్తూ ప్రమాదానికి గురైన గోపీచంద్, ఆ సినిమా విడుదల వాయిదానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.