Nayanthara-Jr NTR : ప్రభాస్ చిన్న పిల్లాడు.. రవితేజతో గ్యాప్ వచ్చింది.. నయనతార కామెంట్స్ వైరల్

Nayanthara Connect Movie నయనతార ప్రస్తుతం కనెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు వచ్చింది. ఇలా ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు  రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 04:35 PM IST
  • నయనతార కనెక్ట్ మూవీ
  • ప్రమోషన్స్‌లో బిజీగా నయన్
  • ఎన్టీఆర్ మీద నయన్ కామెంట్స్
Nayanthara-Jr NTR : ప్రభాస్ చిన్న పిల్లాడు.. రవితేజతో గ్యాప్ వచ్చింది.. నయనతార కామెంట్స్ వైరల్

Nayanthara on Jr NTR నయనతార ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తోంది నయనతార. ఇక సరోగసి మ్యాటర్‌తోనే నయన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లోకి ఎక్కేసింది. అయితే తాజాగా నయనతార మన తెలుగు హీరోల మీద స్పందించింది. తనతో పని చేసిన హీరోల గురించి నయనతార చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక వారి వారి అభిమానులు నయన్ మీద ప్రేమను కురిపిస్తున్నారు.

రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరితోనూ సినిమాలు చేసింది నయనతార. ప్రభాస్ అయితే చిన్న పిల్లాడిలాంటి వాడు.. సెట్స్‌లో అల్లరి చేస్తుంటాడు.. అటూ ఇటూ పరిగెత్తుతూ గంతులు వేస్తుంటాడు.. చాలా మంచివాడు.. అంటూ చెప్పుకొచ్చింది నయనతార. రవితేజ అయితే తనకు ఉన్న వారిలో మంచి ఫ్రెండ్ అని, కాకపోతే ఇప్పుడు కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది నయన్.

రవితేజ తన పనులు, సినిమాలతో బిజీగా అయిపోయాడని, తాను కూడా తన చిత్రాలతో, తన పనుల్లో బిజీగా ఉండటంతో కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది నయన్. కానీ తామిద్దరం కలిసి పని చేసిన సమయంలో మాత్రం ఎంతో సరదాగా ఉండే వాళ్లని చెప్పింది. ఇక రవితేజ అయితే తనతో ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవాడని, ఎక్కువగా జోక్స్ వేసేవాడని, నవ్వించే వాడని చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్‌ అయితే ఎప్పుడూ రిహార్సల్స్ చేసింది లేదు.. డ్యాన్స్ మూమెంట్స్ రిహార్సల్స్ చేద్దామా? అని అడిగితే.. నేను చేయను.. కావాలంటే నువ్ చేయ్ అని నయన్‌ను అనేవాడట. రిహార్సల్స్ అనేవి చేయకుండా.. డ్యాన్స్ అంత బాగా చేయగలిగిన ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే అని నయన్ మెచ్చుకుంది.

Also Read : Nandamuri Taraka Ratna : ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్

Also Read : Pooja Ramachandran Baby Bump : పూజా రామచంద్రన్ బేబీ బంప్ పిక్స్.. భర్తను ముద్దుల్లో ముంచెత్తిన బిగ్ బాస్ బ్యూటీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News