Mega family: చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రం

Mega family: తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికున్న గుర్తింపు, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది తెరంగేట్రం చేశారు. ఇప్పుడు మరో హీరో ముందుకు రానున్నాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 7, 2021, 01:36 PM IST
Mega family: చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రం

Mega family: తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికున్న గుర్తింపు, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది తెరంగేట్రం చేశారు. ఇప్పుడు మరో హీరో ముందుకు రానున్నాడు.

టాలీవుడ్ (Tollywood)సినిమాను నడిపిస్తున్నవారిలో మెగా కుటుంబ సభ్యులదే పైచేయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అంతమంది ఆ కుటుంబం నుంచి సినిమాల్లో అడుగు పెట్టారు. చిరంజీవి (Chiranjeevi) బాటలో పవన్ కళ్యాణ్( Pawan kalyan), నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్‌లు ఇప్పటికే రంగ ప్రవేశం చేశారు. వైవిద్యమైన సినిమాలతో పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే మెగా హిట్ కొట్టాడు. త్వరలో నీహారిక భర్త కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాల్లేకపోలేవు.

ఇక మెగా కుటుంబం (Mega Family)నుంచి వస్తున్న మరో హీరో అల్లు అరవింద్ బావమరిది కుమారుడైన ముత్తంశెట్టి విరాన్(Muttamsetti viran). ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. బతుకు బస్టాండ్ అనే సినిమాతో విరాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బతుకు బస్టాండ్ సినిమా(Bathuku Bustand movie) జూన్ 11న విడుదల కానుంది. పరిస్థితి చూస్తుంటే మెగా కుటుంబంలోని అన్నితరాలు టాలీవుడ్‌లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదు. 

Also read: Mahesh Babu's new caravan: కొత్త క్యారావ్యాన్ కొన్న మహేష్ బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News