Ormax popular Stars: తెలుగులో టాప్ హీరో ఆయనే.. ఇన్ని నెలల తరువాత కూడా అదే జోరు!

 Most popular male Telugu film stars November 2022: తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్స్ జాబితాను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు తాజాగా నవంబర్ నెల లిస్టు కూడా రిలీజ్ అయింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 15, 2022, 02:57 PM IST
Ormax popular Stars: తెలుగులో టాప్ హీరో ఆయనే.. ఇన్ని నెలల తరువాత కూడా అదే జోరు!

Ormax Most popular male Telugu film stars November 2022: తెలుగులో టాప్ హీరో ఎవరు? ఎవరికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు? అని అడిగితే ఏ హీరో అభిమానులు మా హీరోనే గొప్ప అని అనడం సహజం. నిజానికి అసలు నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతూ వస్తూనే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ కరెక్ట్ గా చెప్పలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఏ హీరో తక్కువ కాదు మరో హీరో ఎక్కువ కాదు. ఎవరికి తగినట్లుగా వాళ్లు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్న వారే. అయితే ఈ ఇబ్బందులన్నీ గమనించిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెలా టాప్ హీరోలుగా ఎవరున్నారనే విషయాన్ని ఒక లిస్టు లాగా ప్రచురిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కువగా చర్చ జరిగిన హీరోల జాబితాను ఎప్పుడూ ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రచురిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

నవంబర్ నెలకి గాను ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఇప్పుడు తెలుగు హీరోలకు సంబంధించిన లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో ఎప్పటిలాగే ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించాడు, రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలవగా మూడవ స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. ఇక ఈ లిస్టులో మహేష్ బాబు నాలుగో స్థానం దక్కించుకోగా రామ్ చరణ్ తేజ ఐదవ స్థానం దక్కించుకున్నాడు.

ఆయనను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ ఆరవ స్థానం దక్కించుకున్నాడు. న్యాచురల్ సార్ నాని ఏడవ స్థానం దక్కించుకోగా చిరంజీవి ఎనిమిదవ స్థానం దక్కించుకున్నాడు. అదే విధంగా ఈ లిస్టులో విజయ్ దేవరకొండ తొమ్మిదవ స్థానం దక్కించుకోగా రవితేజ పదవ స్థానం దక్కించుకున్నాడు. ఇక తెలుగులో వీరందరూ టాప్ టెన్ హీరోలు కాగా మిగిలిన టైర్ 2 హీరోలు కూడా చాలామంది ఇప్పుడు నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తం మీద ఇప్పుడు తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారు టాప్ ఫైవ్ లో ప్లేస్ దక్కించుకోగా మిగిలిన వారు కూడా తమ స్థాయికి తగినట్లుగా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదండి నవంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితా.

Also Read: Avatar 2 Box Office : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అవతార్ 2 దెబ్బకు అన్ని రికార్డులు మాయం

Also Read: Bigg Boss Samrat : కొత్త ఇంట్లోకి భార్యతో అడుగుపెట్టిన బిగ్ బాస్ సామ్రాట్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News