OTT Movies: ఆస్కార్ అవార్డు సినిమా ఓపెన్ హైమర్ సహా 21 కొత్త సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం

OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం మరికొన్ని సినిమాలు వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈసారి ఆస్కార్ అవార్డు సినిమాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2024, 12:33 PM IST
OTT Movies: ఆస్కార్ అవార్డు సినిమా ఓపెన్ హైమర్ సహా 21 కొత్త సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం

OTT Movies: ఇటీవలి కాలంలో ధియేటర్ల కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నచ్చిన భాషలో అందుబాటులో ఉండటమే కాకుండా నచ్చిన సమయంలో చూసే వీలుండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రతి వారం తప్పకుండా ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈవారంలో కూడా వివిధ ఓటీటీల్లో సూపర్‌హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో ఆాస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ సినిమా కూడా ఉంది. 

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్ ‌..

మార్చ్ 18న యంగ్ రాయల్స్ ఫరెవర్-స్వీడిష్ సినిమా
మార్చ్ 21న 3 బాడీ ప్లాబ్లమ్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
మార్చ్ 21న ఫైటర్ హిందీ సినిమా
మార్చ్ 22న షిర్లే ఇంగ్లీషు సినిమా
మార్చ్ 22న బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
మార్చ్ 22న ద కసగ్రనేడ్స్ ఇంగ్లీషు సినిమా

అమెజాన్ ప్రైమ్‌లో..

మార్చ్ 19న మరక్కుమ నెంజమ్ తమిళ సినిమా
మార్చ్ 21న రోడ్ హౌస్ ఇంగ్లీషు సినిమా
మార్చ్ 21న ఏ వతన్ మేరే వతన్ హిందీ సినిమా

జియో సినిమాలో..

మార్చ్ 21న ఆస్కార్ అవార్డు ఓపెన్ హైమర్ సినిమా

హాట్‌స్టార్‌లో ..

మార్చ్ 20న అబ్రహాం ఓజ్లర్ తెలుగు డబ్ సినిమా
మార్చ్ 20న ఎక్స్‌మ్యాన్ 97 ఇంగ్లీషు సినిమా
మార్చ్ 20న జపనీస్ వెబ్‌సిరీస్ శాండ్ ల్యాండ్ 
మార్చ్ 22న ఇంగ్లీషు వెబ్‌సిరీస్ డేవీ క్ష జాన్సీస్ లాకర్
మార్చ్ 22న ఇంగ్లీషు సినిమా అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
మార్చ్ 22న హిందీ వెబ్‌సిరీస్ లుటేరే
మార్చ్ 24న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ ఫోటోగ్రాఫర్

ఈటీవీ విన్‌లో మార్చ్ 22న సుందరం మాస్టర్ తెలుగు సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇవి కాకుండా వచ్చేవారం మరి కొన్ని కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. 

Also read: AP & TS SSC Exams 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News