Who is Kumari Aunty : సోషల్ మీడియా కాలంలో ఒక సాధారణ మనిషి సెలబ్రిటీ అవ్వదమనేది సాధారణ విషయం అయిపోతోంది. ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతే చాలు అందులో ఉందే మనుషులు సెలబ్రెటీలకన్నా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.
ఇలా ఒక సోషల్ మీడియా వీడియో ద్వారా తెగ పాపులారిటీ తెచ్చుకుంది కుమారి ఆంటీ. ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి ఆంటీ.. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి, రుచికరమైన భోజనం అందిస్తూ సక్సెస్ ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. అయితే ఈ ఆంటీ ఒక చిన్న వీడియోతో తెగ పాపులర్ అయిపోయింది. ఆ వీడియో విషయానికి వస్తే.. అక్కడ ఎవరో బిల్ ఎంతయింది అని కుమారి ఆంటీ ని అడగగానే…’మీది మొత్తం థౌసంద్ రుపీస్ అమ్మ.. 2 లివర్ ఎక్స్ట్రా’ అని అంటది.. ఆంటీ అన్న ఈ డైలాగ్ రీల్స్ లో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి నుంచి ఈ ఆంటీ ని చూడడానికి జనాలు పరుగులు తీశారు. ఆంటీ షాప్ దగ్గర విపరీతమైన జనం, ట్రాఫిక్ గుమ్ము కూడదంతో పోలీసులు సైతం దానిపైన యాక్షన్ తీసుకున్నాడు.
ఎక్కువమంది జనాలు తాకిడితో అక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం, ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలిగించాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టుల వేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సెలబ్రిటీసే కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కుమారి ఆంటీ కి సపోర్ట్ ఇవ్వడం. మీడియా కవరేజ్ ఎక్కువ కావడంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పదించారు. ఆమెకు అండగా ఉంటానని చెప్పి, ఆమె అక్కడే బిజినెస్ చేసుకునేలా అవకాశం కల్పించారు. అంతేకాదు ఆమెను త్వరలో కలుస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. ఇలా సీఎం కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో.. ఆమె పేరు తెలంగాణ రాష్ట్రం వరకు కాదు ఇంటర్నేషనల్ మిడియాలు వరకు చేరింది.
దీంతో ప్రతి ఒక్కరు ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఆసక్తిని గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పై కొన్ని ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా కుమారి ఆంటీ లైఫ్ గురించి మూడు ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అది కూడా డాక్యుమెంటరీ సిరిసే. ఇప్పుడు అలానే కుమారి ఆంటీ డాక్యుమెంటరీ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే ఈ సంస్థ అధికారికంగా వెలడిస్తుంది అని తెలుస్తోంది. ఇక ఇదే కానీ నిజమైతే కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరగడం ఖాయం.
Also Read: Raw Cat Eat: దేశంలో ఇంకా ఆకలి కేకలా.. దేశాన్ని నివ్వెరపరిచిన 'పిల్లిని తిన్న యువకుడు' సంఘటన
Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి