Viral Video: వామ్మో.. సాయి పల్లవి సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబుల దాడి.. షాకింగ్ వీడియో..

Petrol bomb attack on Theatre: అమరన్ సినిమా నడుస్తున్న తిరునల్వేలీలోని ఒక థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పెట్రో బాంబులు థియేటర్ పై విసిరారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Nov 16, 2024, 02:15 PM IST
  • తమిళనాడులో షాకింగ్..
  • అమరన్ నడుస్తున్న థియేటర్ పై బాంబు దాడి..
Viral Video: వామ్మో.. సాయి పల్లవి సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబుల దాడి.. షాకింగ్ వీడియో..

Three petrol bombs thrown at amran screening theatre video: ఇటీవల  దీపావళికి కానుకగా అమరన్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. అమరన్ మూవీ మేజర్ ముకుంద్ వరద రాజన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014 లో కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడి ముకుంద్ వరద రాజన్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన తమిళనాడుకు చెందిన వారు.  

Add Zee News as a Preferred Source

ఈ సినిమాలో.. ముకుంద్ వరద రాజన్ పాత్రలో.. శివకార్తీకేయన్.. ఆయన సతీమణి ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో.. సాయి పల్లవి నటించారు. ఈ సినిమాలో కొన్ని సన్ని వేశాలు ఒక  వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ప్రస్తుతం కాంట్రవర్షీ నడుస్తొంది. అంతే కాకుండా.. ఈ సినిమాలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవిపై సైతం.. ట్రోలర్స్ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.

 

గతంలో ఇండియన్ ఆర్మీగురించి నోటికొచ్చి మాట్లాడి, పాక్ ఆర్మీతో మన వాళ్లను పోల్చి.. ఈ విధంగా ఆమె ఒక ఆర్మీ అధికారి పాత్రలో ఏవిధంగా నటిస్తుందని ఏకీ పారేశారు. అంతే కాకుండా.. ఆమె ఇండియన్ ఆర్మీకి మొదట సారీ చెప్పాలని కూడా కొంత మంది సోషల్ మీడియాలో ఏకీ పారేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలీలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 

Read more: Naga Chaitanya - Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్‌..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?

తిరునల్వేలీలో అమరన్ మూవీ నడుస్తున్న థియేటర్ పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడికి  తెగబడ్డారు. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది పొలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. మరోవైపు.. అమరన్న మూవీలు నడుస్తున్న కొన్ని థియేటర్ల వద్ద పోలీసులు బందో బస్తు సైతం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News