Prabhas to Mogalturu : పదేళ్ల తరువాత సొంతూరికి ప్రభాస్..ఎందుకంటే?

Prabhas to Visit Mogalturu after 10 years: సుమారు పదేళ్ల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతూరు మొగల్తూరు వెళ్లబోతున్నారు. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 19, 2022, 10:48 AM IST
Prabhas to Mogalturu : పదేళ్ల తరువాత సొంతూరికి ప్రభాస్..ఎందుకంటే?

Prabhas to Visit Mogalturu after 10 years: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన అనూహ్యంగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో ఈ నెల 11వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ సుమారు 10 ఏళ్ల తర్వాత సొంత ఊరు మొగల్తూరు కి వెళ్ళబోతున్నట్లు సమాచారం.

ఈ నెల 11వ తేదీన అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరులో ఈనెల 28వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తున్నా ఆయన పెదనాన్న మృతి చెందడంతో ఆ సినిమా షూటింగ్స్ అన్నింటికీ దూరమయ్యారని తెలుస్తోంది.

తన కుటుంబం బాధలో ఉన్న సమయంలో తాను షూటింగ్స్ కి హాజరు కావడం కరెక్ట్ కాదని భావించిన ప్రభాస్ కాస్త తన చెల్లెళ్లు, పెద్దమ్మ కుదుటపడే వరకు వారితోనే ఉండి వారికి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క ప్రభాస్ ఇంత బాధలో ఉంటే ప్రతి క్షణం ప్రభాస్ మధ్య ప్రేమాయణం మొదలైందని, వారిద్దరూ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడంతో ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ సమయంలో ఎలాంటి వార్తలు రాయాలో కూడా తెలియదా అంటూ బాలీవుడ్ మీడియా మీద వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమాలో రాముడి పాత్రలో నటిస్తుండగా అదే సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనంతటికీ కారణం కాఫీ విత్ కరణ్ షోలో కృతి సనన్ ప్రభాస్ కు కాల్ చేయడమే అని తెలుస్తోంది.  ఎవరైనా మంచి స్నేహితుడికి కాల్ చేయమని కరణ్ జోహార్ కోరడంతో కృతిసనన్ ప్రభాస్ కు కాల్ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ప్రభాస్ కాల్ లిఫ్ట్ చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలైంది.

Also Read: Bigg Boss 6 Nominations Leaked: ఈ వారం మరో షాక్.. ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లోకి.. ఎవరెవరంటే?

Also Read: God Father Release: సల్మాన్ ఖాన్ దెబ్బకు దిగొచ్చిన గాడ్ ఫాదర్ టీం..అంతా సెట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News