Saami Saami Video Song: పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్.. సామి సామి వీడియో సాంగ్ రిలీజ్

Saami Saami Video Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప'. డిసెంబరు 17న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్ల.. ఇప్పుడా సినిమాలోని మరో వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. 'సామి సామి' వీడియో సాంగ్ ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 01:05 PM IST
    • అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా నుంచి మరో అప్డేట్
    • 'సామి సామి' వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్
    • శుక్రవారం (జనవరి 7) ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన 'పుష్ప'
Saami Saami Video Song: పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్.. సామి సామి వీడియో సాంగ్ రిలీజ్

Saami Saami Video Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప ది రైజ్'. డిసెంబరు 17న థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో మూవీలోని 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ కూడా విడుదలై మరోసారి యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతుంది. ఇప్పుడా సినిమా నుంచి మరో వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మూవీలోని 'సామి సామి' వీడియో సాంగ్ ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.  

ఓటీటీ రిలీజ్

డిసెంబరు 17న థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'పుష్ప ది రైజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. అయితే ముందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీని ఓటీటీని రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. శుక్రవారం (జనవరి 7) నుంచి సినిమాను ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి పుష్ప సినిమాను స్ట్రీమింగ్ చేయనునున్నట్లు స్పష్టం చేసింది. 

డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా శుక్రవారం నుంచి (జనవరి 7) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. 

అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ 22 కోట్ల రూపాయలను చెల్లించిందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా మేకర్స్ డిజిటల్ గా ప్రసారం చేయడం గమనార్హం. 

ఈ ఏడాది చివర్లో 'పుష్ప 2'

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ ను 'పుష్ప 2' చిత్రీకరణను మార్చి నుంచి ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను సుకుమార్‌ ప్రారంభించాడు. 'పుష్ప 2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ సెకండ్ పార్ట్ ను డిసెంబర్ 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Also Read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

Also Read: Anasuya Bharadwaj Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న రంగమ్మత్త- వైరల్ పిక్స్ మీరూ చూసేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News