Raghuramakrishnam Raju Alert: చిరంజీవి, బాలయ్య ఫాన్స్ కి అలెర్ట్.. వైసీపీ ఎంపీ కీలక ప్రకటన!

Raghuramakrishnam Raju Alert: సంక్రాంతి సందర్భంగా ఈసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కానున్న క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ ఇద్దరు హీరోల అభిమానులను హెచ్చరించారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 8, 2023, 04:23 PM IST
Raghuramakrishnam Raju Alert: చిరంజీవి, బాలయ్య ఫాన్స్ కి అలెర్ట్.. వైసీపీ ఎంపీ కీలక ప్రకటన!

Raghuramakrishnam Raju Alerts Nandamuri fans and Mega fans: సంక్రాంతి సందర్భంగా ఈసారి రెండు పెద్ద తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు 12, 13వ తేదీల్లో విడుదల కాబోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా ఈ రెండు సినిమాలను నిర్మించడం రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించడంతో రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

ముందుగా 12వ తేదీన బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విడుదల కానుండగా ఆ తర్వాత 13వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవుతోంది. ఒకపక్క నందమూరి అభిమానులు మరొక పక్క మెగా అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని విషయాల్లోనూ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు హిట్ కావాలని రఘురామకృష్ణంరాజు ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. అంతేకాక ఈ సందర్భంగా అభిమానులు చాలా అలర్ట్ గా ఉండాలంటూ వారిని ఆయన హెచ్చరించారు.. తమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారని, ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు పెట్టే విధంగా వారు ప్రవర్తిస్తారని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు.

ఒకరి ఫాన్స్ గా చెప్పుకుంటూ మరో హీరో మీద విమర్శలు గుప్పిస్తారని ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ అభిమానులు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సైతం చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని విధంగా ఆయన కామెంట్ చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది, నవీన్ చంద్ర, లాల్, మురళీ శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తుండగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాని డైరెక్టర్ బాబీ తెరకెక్కించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన కేథరిన్ థెరిసా నటిస్తోంది, ఇక ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read: Ghatkesar Engineering College: ఘట్కేసర్ ఇంజనీరింగ్ కాలేజ్ మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంలో కీలక ట్విస్ట్

Also Read: Pawan Kalyan Comments: బాబును అందుకే కలిశా.. అసలు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News