Ram Charan Emotional Speech: జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు, రామ్‌చరణ్ భావోద్వేగం

Ram Charan Emotional Speech: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రామ్‌చరణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2021, 12:33 PM IST
Ram Charan Emotional Speech: జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు, రామ్‌చరణ్ భావోద్వేగం

Ram Charan Emotional Speech: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రామ్‌చరణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రీ రిలీజ్ వేడుకను పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్..ఇప్పుడు చెన్నైలో ఆ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడిన రామ్‌చరణ్ (Ram Charan)ఉద్వేగానికి గురయ్యాడు. కో హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తారక్ వంటి సోదరుడిని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తారక్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎన్టీఆర్‌ను , తనను కలిపి సినిమా తీసినందుకు ముందుగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. వాస్తవానికి తనకు , తారక్‌కు ఒక ఏడాది మాత్రమే తేడా అని..కానీ అతనిది సింహం వంటి పర్సనాలిటీ అని చెప్పుకొచ్చాడు. తారక్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని..కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెప్పాడు. తారక్ వంటి నిజమైన సోదరుడిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అర్పిస్తున్నానని..తాను చనిపోయేంతవరకూ ఆ సోదరుడిని మనసులో పెట్టుకుంటానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మాటలు విన్న రాజమౌళి, తారక్‌లు (Tarak) కూడా ఉద్వేగానికి లోనై..గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 7వ తేదీన విడుదల కానుంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తుండగా అలియా భట్, ఒలివియో మోరిస్‌లు హీరోయిన్లుగా కన్పించనున్నారు. 

Also read: Upasana UAE Golden Visa: మెగా కోడలుకు అరుదైన గౌరవం..యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న ఉపాసన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News