Ram Charan: యాక్సిడెంట్‌ను తలచుకుని రామ్‌చరణ్‌ కన్నీళ్లు.. సాయి దుర్గా తేజ్‌ భావోద్వేగం

Ram Charan Tej Emotional On Sai Durgha Tej Bike Accident: తనకు ఆత్మీయుడైన సాయి దుర్గా తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన ఉదంతాన్ని గుర్తుచేసుకుని రామ్‌ చరణ్‌ తేజ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2024, 10:45 PM IST
Ram Charan: యాక్సిడెంట్‌ను తలచుకుని రామ్‌చరణ్‌ కన్నీళ్లు.. సాయి దుర్గా తేజ్‌ భావోద్వేగం

Sai Durgha Tej Accident: మెగా కాంపౌండ్‌ నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన సాయి దుర్గాతేజ్‌ హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన తదుపరి 18వ సినిమాను ప్రకటించగా.. ఈ వేడుకలో పాల్గొన్న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. కొన్నేళ్ల కిందట సాయి దుర్గాతేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన విషయాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా గద్గద స్వరంతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Allu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీ

కొత్త దర్శకుడు కేపీ రోహిత్‌తో కలిసి ఐశ్వర్య లక్ష్మితో జంటగా సాయి దుర్గాతేజ్‌ 'సంబరాల ఏటి గట్టు' (ఎస్‌వైజీ) సినిమా చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో.. సరికొత్తగా తీస్తున్న ఈ సినిమాకు సంబంధించిన 'కార్నెజ్‌ లాంచ్‌' పేరిట హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వైజీ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. సాయి దుర్గా తేజ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొన్ని సరదా విషయాలు పంచుకుంటూనే తేజ్‌ బైక్‌ ప్రమాదాన్ని గుర్తు చేసుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యాడు.

Also Read: Mohan Babu Audio: నేను కొట్టింది తప్పే.. మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్

'సినీ పరిశ్రమలో ఒక పోరాటయోధుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సాయి దుర్గా తేజ్‌కు శుభాకాంక్షలు. ఒక మంచి నటుడిగానే కాక ఒక మంచి వ్యక్తి. ఒక మంచి తమ్ముడు.. ఒక మంచి అన్న.. కొడుకు.. అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు' అని రామ్‌ చరణ్‌ తెలిపాడు. 'చాలా బాగా కష్టపడతాడు. చాలా తపన పడతాడు. ప్రతి పాత్రకు తాపత్రయ పడతాడు. మీ అందరి సహకారంతో సాయి దుర్గా తేజ్‌ ఈ స్థాయిలో ఉన్నాడు' అని చెర్రీ చెప్పాడు.

ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదని చెబుతూ రామ్‌ చరణ్‌ తేజ్‌.. 'తేజ్‌ ఇలా మనముందు ఇలా నిలిచి ఉన్నాడంటే ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా మీ ఆశీర్వాదంతోనే తేజ్‌ ఇలా ఉన్నాడు. ఆ రోజు నేను గుర్తు చేయాలనుకోవడం లేదు. కానీ ఇది పునర్జన్మ. ఆ జన్మ మీ ఆశీర్వాదమే ఇచ్చింది' అని రామ్‌ చరణ్‌ తెలిపాడు. 'మేమందరం ఎంత భయపడ్డామంటే ఆ భావనకు ఒక అర్థం కూడా చెప్పలేకపోతున్నా. గుండెను అలా పట్టుకుని మేమందరం మూడు నెలలు చాలా చాల కష్టమైన సమయం అది. మేం చేసిన ప్రయత్నమంతా దండం పెట్టుకోవడం తప్ప' అంటూ రామ్‌ చరణ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రించుకుని భావోద్వేగాన్ని ఆపుకోవడానికి సాయి దుర్గ తేజ్‌ను రామ్‌ చరణ్‌ తన వద్దకు పిలుచుకున్నాడు. అనంతరం మాట్లాడుతుండగా అభిమానుల కేరింతలు.. అరుపులతో మళ్లీ చెర్రీ భావోద్వేగానికి లోనయి కొద్దిసేపు మాట్లాడలేకపోయారు. 'నిజంగా మీరు మామూలు అభిమానులు కాదు. బంగారు అభిమానులు. చాలా ధన్యవాదాలు' అభిమానులకు చరణ్‌ ధన్యవాదాలు తెలిపాడు.

'ఈ తేజ్‌ మా తేజ్‌ కాదు. ఆ పెద్ద ప్రమాదం నుంచి మళ్లీ ఇక్కడ నిలిచి ఉన్నాడంటే అది మీ తేజ్‌. మీరు జన్మనిచ్చిన తేజ్‌. మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు' అంటూ సాయి దుర్గా తేజ్‌ అనుబంధాన్ని రామ్‌ చరణ్‌ పంచుకున్నాడు. అనంతరం సంబరాల ఏటి గట్టు సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఇది ఒకటే మాట. తేజ్‌ ఊచకోత ఎలా ఉండబోతున్నదో చూడబోతున్నారు. కొత్త సినిమా చేస్తున్న రోహిత్‌కు అభినందనలు. ఇంత బడ్జెట్‌ పెడుతున్న నిర్మాతలకు శుభాకాంక్షలు. ఈ సినిమా భారీ విజయం పొందాలని మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటున్నా' అని చెర్రీ తెలిపాడు. తేజ్‌ ప్రేమ బండ ప్రేమ. అంత గట్టిగా పట్టుకుంటున్నాడు. అంత గట్టిగా ప్రేమిస్తుంటాడు. ఈ బండ ప్రేమ మగాళ్లకు చూపిస్తున్నాడు. ఆడవాళ్లకు చూపించడం లేదు. వాళ్ల అమ్మ ఇదే మొత్తుకుంటున్నారు. తొందరగా పెళ్లి చేయాలని కోరుకుంటున్నా' అంటూ తేజ్‌ పెళ్లిపై రామ్‌ చరణ్‌ మాట్లాడారు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా రూ.100 కోట్లతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News