అనారోగ్యం గురించి వస్తోన్న పుకార్లపై ఘాటుగా స్పందించిన రానా దగ్గుబాటి

టాలీవుడ్ మాచోమ్యాన్ రానా

Last Updated : Jun 25, 2018, 04:55 PM IST
అనారోగ్యం గురించి వస్తోన్న పుకార్లపై ఘాటుగా స్పందించిన రానా దగ్గుబాటి

టాలీవుడ్ మాచోమ్యాన్ రానా దగ్గుబాటి ఆరోగ్యం బాగోలేదని, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రానాకు త్వరలోనే చికిత్స ప్రారంభం కానుందని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తనకు కంటి సమస్యలతోపాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వినిపిస్తున్న రకరకాల చర్చలపై ఇప్పటికే పలుమార్లు స్పందించి, ఖండించిన రానా మరోసారి ఆ పుకార్లపై స్పందించాడు. కేవలం రక్తపోటు తప్పించి ఇంకెటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఓ ట్వీట్ చేసిన రానా.. తన ఆరోగ్యం గురించి అభిమానులు చూపిస్తున్న శ్రద్ధకు కృతజ్ఞతలు ట్విటర్ ద్వారా తెలిపాడు. అయితే, అదే సమయంలో తన ఆరోగ్యం గురించి లేని పోని పుకార్లు, ఊహాగానాలు సృష్టించొద్దని రానా అభిమానులు, సోషల్ మీడియాను వేడుకున్నాడు. 

 

రానా ఇంత స్పష్టంగా చెప్పాడు కనుక ఇకనైనా అతడి ఆరోగ్యం గురించి వినిపిస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశిద్దాం. 

Trending News