Orange Re Release Trailer : ఆరెంజ్ రీ రిలీజ్ ట్రైలర్.. నోస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చేలా చేసిన చెర్రీ

Orange Re Release Trailer ఆరెంజ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25, 26న థియేటర్లో స్పెషల్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 07:09 PM IST
  • రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్
  • థియేటర్లోకి రాబోతోన్న ఆరెంజ్
  • రీ రిలీజ్ ట్రైలర్ విడుదల
Orange Re Release Trailer : ఆరెంజ్ రీ రిలీజ్ ట్రైలర్.. నోస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చేలా చేసిన చెర్రీ

Orange Re Release Trailer మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన ఆరెంజ్ సినిమా పన్నెండు, పదమూడేళ్ల క్రితం వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ సినిమా అప్పుడు కాదు.. ఇప్పుడు రావాల్సింది అని అంతా భావిస్తుంటారు. అందుకే ఈ సారి రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

మామూలుగా అయితే మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ నాగబాబు నిర్మాతగా తీసిన ఆరెంజ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసి.. దాని ద్వారా వచ్చిన డబ్బుని జనసేనకు విరాళంగా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆరెంజ్ సినిమాను మార్చి 25, 26న రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో ఆరెంజ్ సినిమాకు సంబంధించి రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. మళ్లీ ఓ పదమూడేళ్లు వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఆరెంజ్ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అన్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News