Renu Desai Fed up With Pawan Kalyan Fans: సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరి మీద పడితే వారి మీదకు వెళ్తుంటారు. వాగ్వాదానికి దిగుతుంటారు. రెబెల్స్ మాదిరి ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వస్తే దారుణంగా ట్రోల్స్ చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు, రేణూ దేశాయ్‌కి మధ్య ఉన్న గ్యాప్, కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. రెండో పెళ్లికి సిద్దమైన రేణూ దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరించారు. రెండో పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారు.
ఇలానే మీ అన్న పవన్ కళ్యాణ్‌ని కూడా నిలదీయొచ్చు కదా? అక్కడకు వెళ్లి ప్రశ్నించొచ్చు కదా? అని పవన్ కళ్యాణ్ అభిమానుల మీద రేణూ దేశాయ్ మండి పడింది. ఏమైందో ఏమో గానీ.. రెండో పెళ్లి విషయంలో రేణూ దేశాయ్ వెనుకడుగు వేసింది. పిల్లల్ని పెంచుకుంటూ తన జీవితాన్ని తాను వెళ్లదీస్తోంది. అయితే అకిరా నందన్ మీద మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు చాలానే అంచనాలు పెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ లెగసీని ముందుకు తీసుకెళ్లేది అకిరా నందన్ అని నమ్ముతున్నారు. నిన్న అకిరా నందన్ బర్త్ డే సందర్బంగా రేణూ దేశాయ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. ఇది చాలా అన్యాయమని, మా అకిరాను ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు అంటూ ఇలా రేణూ దేశాయ్‌కి కామెంట్లు పెట్టారు.
Also Read: Akira Nandan Birthday : అకిరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూ. పవర్ స్టార్ రేర్ పిక్స్
వాటిని చూసి రేణూ దేశాయ్ గట్టిగానే రియాక్ట్ యఅఇంది. మీ అన్న కొడుకు?.. అకిరా నా అబ్బాయి అంటూ అందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అకిరా బర్త్ డే నాడు కూడా ఇలా బాధపెట్టాలా?.. మీకు కనీసం మానవత్వం లేదా? అంటూ మండి పడింది. తండ్రి పేరుతోనే బిడ్డను గుర్తిస్తారు.. అదే మన కల్చర్.. ఇలా ఏ కారణం లేకుండా మాలాంటి ఫ్యాన్స్‌ను తిట్టకండి అంటూ అని ఇంకో ఫ్యాన్ అంటే.. దానికి రేణూ దేశాయ్ ఇలా సమాధానం ఇచ్చింది. మీకు జన్మనిచ్చిన ఆడవాళ్లను ఇలా కంటిన్యూగా అగౌరవపర్చడమేనా? నీ కల్చర్.. ఆ దేవుడి కంటే అమ్మకే ఎక్కువ విలువిస్తాం మన కల్చర్‌లో.. వెళ్లి నీ ఇంట్లో ఆడవాళ్లను అడిగి తెలుసుకో..
అభిమానులు అని చెప్పుకునే వారికి నువ్వెళ్లి చెప్పు.. నా పోస్ట్‌ల మీద కామెంట్ చేయొద్దని, నేనేమీ కారణం లేకుండా తిట్టడం లేదు.. వాళ్లే ముందు కామెంట్లు చేశారు.. నేను ఎవరి ఫ్యాన్ పేజ్‌ల వద్దకు వెళ్లి కామెంట్ చేయలేదు.. పదకొండేళ్లుగా మీరు నన్ను విలన్‌గా చిత్రీకరిస్తూనే ఉన్నారు.. ఇక నేను విసిగిపోయాను.. నా మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది.. అంటూ రేణూదేశాయ్ ఆవేదన చెందింది.
మరి మీ అబ్బాయిని ఫెస్టివల్‌కు అక్కడకు ఎందుకు పంపిస్తున్నారు..అని ఇంకో నెటిజన్ నిలదీశాడు. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా?.. ఆయనకు మీలో ఎవరో ఒకరు అర్థమయ్యేలా చెప్పండి.. నాకు ఇంక ఓపిక లేదు.. అంటూ చేతులెత్తి దండం పెట్టేసింది రేణూ దేశాయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Renu Desai Fed up With PK Fans: వేధిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. రేణూ దేశాయ్ ఆవేదన.. అకిరా బర్త్ డే రోజు రచ్చ రచ్చ
రేణూ దేశాయ్‌ని వేధిస్తున్న ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో వాగ్వాదం
వేడుకున్న రేణూ దేశాయ్