Kantara Update: కేజిఎఫ్ సినిమా తర్వాత అదే రేంజ్ లో ప్యాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ సినిమా కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా వ్యవహరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడలో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా.. కాంతారా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప, సలార్ వంటి సినిమాల సీక్వెల్స్ తో పాటు.. కాంతారా సీక్వెల్ కోసం కూడా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో కాంతారా 2 సినిమా గురించి వచ్చిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రిషబ్ శెట్టి చాలా బాగా కష్టపడుతున్నారట. కాంతారా కంటే ఈ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై రిషబ్ కి పూర్తి నమ్మకంగా ఉందంట ఈ చిత్రం కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట ఈ హీరో. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం 200x200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని.. సెట్ రూపంలో పునః సృష్టి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం.. ఈ సెట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం దాదాపు 600 మంది కార్పెంటర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారట. ఇక సినిమాలో తన పాత్రికి తగ్గట్టుగా.. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటివి ప్రాక్టీస్ చేయడం కోసం రిషబ్ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారట. దీనికోసం వర్క్ షాప్ లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం ఇంతలా కష్టపడటంతో.. ఈ చిత్రం మరింతగా ఉంటుందో అని ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సమయానికి సినిమా పూర్తి అవ్వకపోతే.. సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలవచ్చు.
Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో విడుదల.. అదిరిపోయే హామీలు ప్రకటన
Also Read: YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook