Ritu Raj Singh No More: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి..

Ritu Raj Singh No More: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రితు రాజ్ సింగ్ హృద్రోగంతో కన్నుమూసారు. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 21, 2024, 11:24 AM IST
Ritu Raj Singh No More: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి..

Ritu Raj Singh No More: బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లతో పాటు సీరియల్స్‌లో నటించిన ప్రముఖ నటుడు రితు రాజ్ సింగ్ హార్ట్ ఎటాక్‌తో కన్నమూసారు. ఆయన వయసు 59 యేళ్లు. బాలీవుడ్‌లో 'తునివు', యారియాన్ 2, బద్రినాథ్‌ కీ దుల్హనియా వంటి చిత్రాల్లో ఈయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ముఖ్యంగా హిందీలో వచ్చిన 'అనుపమా' బనేగి అప్నీబాత్, హిట్లర్ దీదీ వంటి పలు ధారావాహికల్లో నటించి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈయన చిరవగా రోహిత్ శెట్టి దర్శక, నిర్మాణంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్‌'లో కనిపించారు. ఆయన చనిపోయినట్టు ఆయన సన్నిహిత మిత్రుడైన అమిత్ బెహల్ ప్రకటించడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.

ఈయన కడుపు నొప్పితో కొన్ని రోజుల క్రితం హాస్పిటల్‌లో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతా బాగుంటుందనుకున్న ఈ సమయంలో సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో ఒక్కసారి కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఇక రితురాజ్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేసారు.

రితురాజ్.. బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్‌ క్లాస్ మేట్. దిల్లీ విశ్వవిద్యాలయంలో వీళ్లిద్దరు కలిసి చదవుకున్నారు. అక్కడే సినిమాల్లోకి రావాలని ప్లాన్స్ వేసుకున్నారు. వీళ్లిద్దరు కలిసి బ్యారీ జాన్స్ థియేటర్ యాక్షన్ గ్రూపులో కలిసి నాటకాలు వేసేవారు. ముందుగా షారుఖ్ ఖాన్.. ముంబై వెళ్లి స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత తన స్నేహతుడిని తన దగ్గరకు రప్పించి అతనికి సినిమాల్లో అవకాశాలు ఇప్పించాడు. అలా రితురాజ్ ముంబై చిత్రపరిశ్రమలో నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక స్నేహతుడి మరణంతో షారుఖ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈయన మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఓ మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయిందని బాధ పడుతోంది.

ఇదీ చదవండి: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News