Amit Shah, Rohit Shetty meeting: తారక్, రోహిత్ శెట్టితో అమిత్ షా మీటింగ్స్ ఆర్ఎస్ఎస్ మూవీ కోసమేనా ?

Amit Shah, Rohit Shetty meeting: ఇటీవల హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన అమిత్ షా.. తాజాగా సోమవారం ముంబైలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన కొద్ది రోజులకే అమిత్ షా ముంబైలో రోహిత్ శెట్టితో భేటీ అవడం రాజకీయంగా, సినిమా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2022, 02:00 AM IST
Amit Shah, Rohit Shetty meeting: తారక్, రోహిత్ శెట్టితో అమిత్ షా మీటింగ్స్ ఆర్ఎస్ఎస్ మూవీ కోసమేనా ?

Amit Shah, Rohit Shetty meeting: ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.. అదే పర్యటనలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, మొన్న తారక్‌ని కలిసిన అమిత్ షా.. తాజాగా సోమవారం ముంబైలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన కొద్ది రోజులకే అమిత్ షా ముంబైలో రోహిత్ శెట్టితో భేటీ అవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తారక్, అమిత్ షాల భేటీ గురించి అటు ఇండస్ట్రీలో ఇటు జనంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలావుండగానే అమిత్ షా, రోహిత్ శెట్టిల భేటీ జరిగిందంటే.. ఆర్ఎస్ఎస్ హిస్టరీపై సినిమాకు బ్యాగ్రౌండ్ వర్క్ మొదలైందా అనే టాక్ వినిపిస్తోంది. 

తారక్‌తో భేటీతో మరోసారి తెరపైకొచ్చిన ఆర్ఎస్ఎస్ మూవీ
ఆర్ఎస్ఎస్ చరిత్రను ఘనంగా చాటిచెప్పేలా ఓ సినిమాకు ప్లానింగ్ జరుగుతోందని.. ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ చేత స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారని.. అందులో భాగంగానే ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడైతే తారక్, అమిత్ షాల భేటీ జరిగిందో.. అప్పటి నుంచే ఇందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గెవార్ పాత్రలో తారక్ నటించేలా ఆయన్ని ఒప్పించాలని.. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అంతకంటే ముందుగా తారక్‌తో కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో తారక్‌ని కలిసి ఉంటారని టాక్ వినిపించింది. 

రోహిత్ శెట్టితో భేటీ కూడా అలాంటిదేనా ?
ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కేఎస్ హెడ్గెవార్ పాత్రలో తారక్‌ని ఊహించుకుంటున్న బీజేపి అధినాయకత్వం.. ఆ సినిమాకు అవసరమైన ఇతర సాంకేతిక నిపుణుల వేటలో పడిందని.. అందుకే ముంబైలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో భేటీ జరిగి ఉండి ఉంటుందనేది లేటెస్ట్ టాక్. రోహిత్ శెట్టితో భేటీ అయినట్టుగా ట్విటర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేసిన అమిత్ షా.. అంతకు మించి మరే ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శెట్టి నుంచి మీడియాకు ఎలాంటి ప్రకటన రానుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే, రోహిత్ శెట్టి మీడియాకు ఏదో ఒకటి చెప్పడం కంటే ముందుగానే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినీ ప్రముఖులతో ఈ వరుస భేటీలు ఆర్ఎస్ఎస్ మూవీ కోసమేనా (RSS Movie) అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇవి పుకార్లా లేక వాస్తవాలేనా అనేది కొద్ది రోజులాగితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.

Also Read : Geetu Royal Vs Inaya Sulthana: మొదటి రోజే కిరికిరి పెట్టేసిన బిగ్ బాస్.. నువ్వా నేనా అనేస్థాయిలో గీతూ-ఇనయా

Also Read : Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌ 6లో రెండు జంటలు… మళ్లీ రెచ్చిపోయి దారుణ కామెంట్స్ చేసిన నారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News