Chiranjeevi About Sai Dharam Tej సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా గురించి చెబుతూ.. తనకు ప్రమాదం జరిగిన నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. అస్సలు మాటలు కూడా రాలేని స్థితిలో ఉన్నానని, మళ్లీ తనకు మాటలు మాట్లాడటం తన తల్లి నేర్పించిందని, 36 ఏళ్ల వయసులో మళ్లీ తన తల్లి మాటలు నేర్పించి తనకు పునర్జన్మను ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు. తల్లిప్రేమ కంటే గొప్పది ఏమీ లేదని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
యాక్సిడెంట్ జరిగిన తరువాత చిరంజీవి ఓ కొటేషన్ పంపించాడట. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించాడని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను తన అమ్మ, తమ్ముడి గురించి చెప్పానని ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కష్టపడ్డానని, వర్క్ షాప్ విషయంలోనూ చాలా ఇబ్బంది పడ్డట్టుగా చెప్పుకొచ్చాడు. వర్క్ షాప్‌లో అయితే మాటలు సరిగ్గా రాలేదని, షూటింగ్ మొదటి రెండు రోజులు మాటలు కూడా సరిగ్గా మాట్లాడటానికి రాలేదని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.
Also Read: Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్
ఇది హారర్ సినిమానే అయినా కూడా ఓ సెక్షన్ ఆడియెన్స్‌కు టార్గెట్ చేసినట్టుగా అనిపించినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని, ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక లేయర్ ఉంటుందని, కొత్తగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో కార్తీక్ చెప్పిన నెరేషన్ విన్నప్పుడే సినిమా హిట్ అవుతుందని, అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. నిర్మాతలు తనకు ఎంతగానో సపోర్టివ్‌గా నిలిచారని అన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook