Samantha Clarity: వాటి గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు.. నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్లపై సమంత ఓపెన్

Samantha Condemns Reaction: నాగ చైతన్య శోభిత ధూళిపాళ డేటింగ్ మీద ఇప్పటికే లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఆ రూమర్ల మీద సమంత పరోక్షంగా స్పందిస్తుండటంతో మరింతగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ సారి నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్ల మీద పరోక్షంగా స్పందించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 02:21 PM IST
  • మరోసారి తెరపైకి నాగ చైతన్య శోభితల డేటింగ్‌
  • సమంత స్పందించిందంటూ వార్తలు వైరల్
  • ఎప్పుడూ అలా అనలేదన్న సామ్
Samantha Clarity: వాటి గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు.. నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్లపై సమంత ఓపెన్

Samantha Condemns Reaction: నాగ చైతన్య, శోభిత డేటింగ్ రూమర్ల మీద సమంత స్పందించినట్టుగా.. ఎవరెటు పోతే నాకేంటి.. ఎవరు ఎవరితో ఉన్నా నాకు బాధలేదంటూ సమంత స్పందించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో లోకల్ మీడియా కూడా సమంత వార్తలను ప్రచురించింది. అయితే వీటిపై తాజాగా సమంత స్పందించింది. ఆ వార్తల మీద నేను స్పందించలేదు.. నేను ఎప్పుడూ అలా అనలేదు అని సమంత క్లారిటీ ఇచ్చింది.

నాగ చైతన్య శోభిత డేటింగ్‌ చేస్తున్నారంటూ గత కొన్ని నెలలు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. లండన్‌లో ఈ ఇద్దరూ కలిసి చక్కర్లు కొడుతున్నారని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. లండన్‌లోని ఓ హెటల్‌లో చైతూతో చెఫ్‌ దిగిన ఫోటోల వల్ల శోభిత సీక్రెట్ కూడా బయటపడింది. ఇక ముంబైలోనూ ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని చెబుతుంటారు.

అలా నాగ చైతన్య, శోభిత డేటింగ్ రూమర్ల మీద వార్తలు వస్తే గతంలో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇదంతా సమంత పీఆర్ టీం కావాలనే చేస్తోందంటూ అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో సమంత రంగంలోకి దిగింది. ఇదే హీరోయిన్‌ మీద రూమర్లు వస్తే నిజమని నమ్ముతారు.. మీ హీరో మీద వచ్చే సరికి పీఆర్ టీం చేసిందని అంటున్నారా? అని నిలదీసింది.

అలా సమంత స్పందించడంతో.. నాగ చైతన్య, శోభిత డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఇప్పుడు మళ్లీ సమంత స్పందించింది. తాను నాగ చైతన్య, శోభితల డేటింగ్ మీద స్పందించినట్టుగా.. నాగ చైతన్యకు ప్రేమ విలువ తెలియదన్నట్టు.. ఆయనతో ఎవ్వరున్నా, ఎంత మందితో డేటింగ్ చేసినా.. వాళ్లకు కన్నీళ్లు తప్పవని, కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటే చాలు అని సమంత అనేసినట్టుగా జాతీయా మీడియా రాసింది.

కానీ తాను అలా అనలేదని, అసలు వాటి మీద స్పందించలేదు అన్నట్టుగా సమంత ఖండించింది. దీంతో అసలేం జరుగుతోందని అటు చై అభిమానులు.. ఇటు సమంత అభిమానులు అనుకుంటున్నారు. ఈ వార్తలు ఎక్కడి నుంచి ఎలా పుడుతున్నాయని అంతా అనుకుంటున్నారు.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News