Samantha reaction : రామ్ చరణ్ కామెంట్స్‌పై సమంత రియాక్షన్.. ఆ సింబల్స్‌తో పోస్ట్

Samantha reaction on Ram Charan comments : రామ్ చరణ్ చేసిన కామెంట్స్‌కు ఫుల్ హ్యాపీగా ఫీలవుతోంది సమంత. మూడు లవ్‌ సింబల్స్‌తో ట్వీట్ చేసింది సామ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 03:34 PM IST
  • సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌
  • సమంతపై రామ్‌ చరణ్ ఆసక్తిర వాఖ్యలు
  • రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్
  • చెర్రీ చేసిన కామెంట్స్‌పై సామ్ రియాక్షన్
Samantha reaction : రామ్ చరణ్ కామెంట్స్‌పై సమంత రియాక్షన్.. ఆ సింబల్స్‌తో పోస్ట్

Samantha Ruth Prabhu's reaction on Ram Charan comments : నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సామ్ కూడా చైతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటుంది. మునపటి కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జోష్ పెంచింది సామ్. 

తాజాగా సమంతపై రామ్‌ చరణ్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఆర్ఆర్ఆర్ టీమ్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కానుంది. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో సమంత (Samantha) గురించి మీ అభిప్రాయం చెప్పమంటూ హోస్ట్.. రామ్‌ చరణ్‌ను అడిగాడు. 

దీంతో చెర్రీ.. సమంత కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌.. అంటూ సామ్ గురించి చెప్పేశాడు. సమంతపై... రామ్ చరణ్ చేసిన కామెంట్స్ (Ram Charan Comments) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : RRR Movie: 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్... ఫ్యాన్స్ ఫిదా...

రామ్ చరణ్ (Ram Charan) తనపై చేసిన కామెంట్స్‌కు ఫుల్ హ్యాపీగా ఫీలవుతోంది సమంత. సామ్‌.. (Sam) చెర్రీ చేసిన కామెంట్స్‌ను మెచ్చుకుంటూ రియాక్షన్ ఇచ్చింది. సంతోషాన్ని వెల్లుబుచ్చింది. రామ్ చరణ్ చేసిన (Ram Charan) కామెంట్స్ వీడియోను అటాచ్ చేస్తూ.. మూడు లవ్‌ సింబల్స్‌తో ట్వీట్ చేసింది సామ్. ఇప్పుడు సామ్ పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెర్రీ సరసన సామ్ రంగస్థలం మూవీలో నటించిన విషయం తెలిసిందే.

 

Also Read : బాలకృష్ణ పాటకు స్టెప్పులేసిన రవితేజ.. అన్‌స్టాప‌బుల్‌ లేటెస్ట్ ప్రోమో అదుర్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News