Polimera 2 OTT: ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన సత్యం రాజేష్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Polimera 2 ott: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు సాలిడ్ హిట్స్ కొడుతున్నాయి. ఆలాంటి సినిమాల్లో ఒకటి పొలిమేర 2. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 04:42 PM IST
Polimera 2 OTT: ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన సత్యం రాజేష్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Maa Oori Polimera 2 ott Release date: సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్‌ శ్రీను లీడ్ రోల్స్ లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర-2' (Maa Oori Polimera 2 ). అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గౌరికృష్ణ నిర్మించారు. నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొలిమేరకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. జ్ఞాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీకి హైలైట్ గా నిలిచింది. 

ఈ మధ్య సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా పొలిమేర-2 కూడా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. పొలిమేర 2 డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌  కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబరు 08న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. 

మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన పొలిమేర మెుదటి పార్టుకు ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో దానికి సీక్వెల్ గా సేమ్ కాన్సెప్ట్ తో పొలిమేర 2ను రూపొందించారు మేకర్స్. మెుదటి పార్టును ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఎండ్ చేసి.. సెకండ్ పార్ట్ పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. దీంతో పొలిమేర 2ను థియేటర్లలో రిలీజ్  చేసి సక్సెస్ చేశారు. ఈ మూవీలో సత్యం రాజేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read: Rishab Shetty Remuneration: వామ్మో.. కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News