Shriya Saran: హీరోయిన్ శ్రియశరన్ అతి పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేసింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాక్ కు గురిచేసింది. '2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్లో ఉండిపోయారు. కోవిడ్(Covid-19) కారణంగా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను' అంటూ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది.
Also read:Nedumudi Venu: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం...జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు మృతి
2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్(Andrei Koscheev)ను శ్రియ(Shriya Saran) పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ(Pregnancy) గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి