Mahesh Babu - Rajamouli - SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి బాహుబలి లెవల్లో ప్లాన్.. సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్ తెప్పించే న్యూస్..

Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు  కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజ‌మౌళి. తాజాగా ఈ సినిమా కోసం బాహుబలి లెవల్లో పెద్ద స్కెచ్చే వేసాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2024, 12:47 PM IST
Mahesh Babu - Rajamouli - SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి బాహుబలి లెవల్లో ప్లాన్.. సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్ తెప్పించే  న్యూస్..

Mahesh Babu - Rajamouli -SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక బాహుబలి రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్  ఎదురు చూపులు ఫలించే రోజులు రానే వచ్చాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు రాజమౌళి తెలిపారు.  మరోవైపు ఈ సినిమా టైటిల్ ఇదే నంటూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వాటన్నిటినీ రాజమౌళి కొట్టిపారేసారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం 8 లుక్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు పై టెస్ట్ షూట్స్ కూడా చేస్తున్నారు. అందులో ఏది బాగా వస్తే దాన్నే ఫైనల్ చేస్తారట. ఇప్పటి వరకు కనిపించిన మహేష్ బాబు కాకుండా కొత్త మహేష్ బాబును చూస్తారన్నారు. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో చూపించబోతున్నాడట. మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత 'నాని' సినిమా క్లైమాక్స్‌లో మాత్రమే తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్లో కనిపించాడు. అంతకు ముందు బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. 

ఇపుడు రాజమౌళి విక్రమార్కుడు, బాహుబలిలో రవితేజ, ప్రభాస్‌లతో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయించాడు. ఇపుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాలో డోపర్ గాంగల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని సమాచారం. తెలుగులో ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్ అని చెబుతు్నారు. ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో  తెలుగు నటీనటులతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటుల కలయికలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. 

మరోవైపు మహేష్ బాబు ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రెయిన్ అవుతున్నాడు. అందుకోసం ప్రత్యేక డైట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. యాక్ష‌న్ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో  స్టంట్స్ యాక్షన్ సీన్స్ కు ప్రాముఖ్య‌త ఉన్నాయి. దీని కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్‌తో పాటు ప‌లు వ్యాయామాలు చేస్తున్నాడు. అక్క‌డే ఈ సినిమాకు సంబంధించిన‌ కొన్ని యాక్షన్స్ సీన్స్ లో ట్రెయిన్ అవుతున్నాడు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళితో వర్క్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డం పెంచి సరికొత్తగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక రాజ‌మౌళి, మ‌హేష్ బాబు సినిమా ఉగాది కానుక‌గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించినున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలుబ‌డాల్సి ఉంది. 

మ‌రోవైపు అప్ప‌టి నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసిన మ‌హేష్ బాబు పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 9న రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అతిర‌థ మ‌హార‌థులు హాజ‌రు కానున్నారట.  ఇక రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్ బాబు కొత్త లుక్‌లో మేకోవ‌ర్ కానున్నాడు. అందుకే ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మ‌హేష్ బాబు ఎక్క‌డా క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని జ‌క్క‌న్న కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఈ లోపు మ‌హేష్ బాబు త‌న చేతిలో ఉన్న కొన్ని బాండ్ ఎండార్స్‌మెంట్స్ షూటింగ్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ముందుగా ఈ పాత్ర కోసం విక్ర‌మ్ లేదా బాల‌య్యల‌ను అనుకున్నారు. ఫైన‌ల్‌గా నాగార్జున న‌టించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. 

మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమాను  డాక్టర్ కే.ఎల్. నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఆధారంగా యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని 2025 ఎండింగ్‌లో కానీ.. 2026 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నాడు. 
Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News